7th Pay Commission Da Hike: న్యూ ఇయర్ సందర్భంగా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 7వ పే కమిషన్ జీతం ప్యాకేజీ కింద వచ్చే ఏడాది మార్చి నాటికి డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. డీఎ పెంపుతో పాటు పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్)ని కూడా కేంద్ర ప్రభుత్వం పెంచవచ్చని సమాచారం.
డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ రెండూ సంవత్సరానికి రెండుసార్లు పెంచుతున్న విషయం తెలిసిందే. జనవరి, జూలై నెలలో పెంచుతుంది. ఇప్పుడు త్వరలో రాబోయే నూతన సంవత్సరం నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు డీఎ పెంపు వార్తలు అందుతాయి. మార్చి 2023 నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 నుంచి 5 శాతం డీఏ పెంపు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో డీఏను పెంచింది కేంద్ర ప్రభుత్వం. దీని ద్వారా దాదాపు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందారు. ప్రభుత్వం డీఏలో 4 శాతం పెంపును ప్రకటించింది. దీంతో మొత్తం డియర్నెస్ అలవెన్స్ 38 శాతానికి చేరుకుంది. మార్చిలో దీనిని 3 శాతం పెంచారు. అయితే గతంలో ప్రభుత్వం కోవిడ్ మహమ్మారి సమయంలో డీఏ పెంపును ప్రకటించలేదు.
అదేవిధంగా త్వరలో ఉద్యోగుల జీతాల్లో పెంపుదల ఉండబోతుందని సమాచారం. ఏకమొత్తంలో జీతం పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను కూడా సవరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా.. త్వరలోనే అప్డేట్ వస్తుందంటున్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు 2.57 ప్రకారం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ లభిస్తుండగా.. దీన్ని 3.68కి పెంచాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇదే జరిగితే ఉద్యోగుల కనీస వేతనం నేరుగా రూ.18,000 నుంచి రూ.26 వేలకు పెరుగుతుంది.
Also Read: Ind Vs Ban: బంగ్లాతో రెండో టెస్టుకు ముందు బ్యాడ్‌న్యూస్.. ఇద్దరు ప్లేయర్లు ఔట్
Also Read: Ap Rains: ఏపీకి మళ్లీ వర్ష సూచన.. ఈ ప్రాంతాలపై ఎఫెక్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook