Victory Venkatesh Makeup Man Raghava Reveals Wig Secrets: రామానాయుడు కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన వెంకటేష్ కలియుగ పాండవులు అనే సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత అనేక సినిమాలు చేస్తూ ఆయన తెలుగు ప్రేక్షకులకు విక్టరీ వెంకటేష్ అనే పేరుతో సుపరిచిత మయ్యారు. ఈ రోజు కూడా ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే మినిమం గ్యారెంటీ సినిమాగా అందరూ భావిస్తూ ఉంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఆయన సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
అయితే ఆయన హెయిర్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టారు ఆయన మేకప్ మాన్ రాఘవ. కలియుగ పాండవులు సినిమా నుంచి వెంకటేష్ మేకప్ మెన్ గా పనిచేస్తున్న రాఘవ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వెంకటేష్ విగ్గుల గురించి పలు ఆసక్తికర విషయాలు బయట పెట్టారు. సినిమాలను బట్టి వెంకటేష్ విగ్గుల ఎంపిక ఉంటుందని తాను, సినిమా డైరెక్టర్, వెంకటేష్ గారు, హెయిర్ స్టైలిస్ట్ ఇలా అందరూ కూర్చుని డిస్కస్ చేసి వెంకటేష్ గారికి ఎలాంటి విగ్ సెట్ అవుతుంది అనే విషయం మీద ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
ఒకప్పుడు బాంబే నుంచి విగ్గులు తీసుకువచ్చే వాళ్ళం కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువగా విదేశాల నుంచి విగ్గులు తీసుకొస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వెంకటేష్ విగ్గు ఒక్కో దాని కోసం సుమారు 60, 70 వేలు ఖర్చు పెడతామని షూటింగ్ గనక ఆరేడు నెలలు ఉంటుందని తెలిస్తే రెండు మూడు విగ్గులు తెప్పించి వాడతామని చెప్పుకొచ్చారు. వయసు రీత్యా వెంకటేష్ జుట్టు పలచబడిందని అందుకే సినిమా సినిమాకు వేర్వేరు విగ్గులు వాడుతూ ఆయన హెయిర్ స్టైల్ ని ప్రేక్షకులకు చూపిస్తూ ఉంటామని చెప్పుకొచ్చారు.
సాధారణంగా అయితే ఆయన విగ్గు పెట్టుకోవడానికి ఇష్టపడరు కానీ పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు హీరోగా ఒక ఇమేజ్ ఉంటుందని దాన్ని మెయింటైన్ చేయడం కోసమే వెంకటేష్ విగ్గు వాడతారని చెప్పుకొచ్చారు. సురేష్ బాబు గారి జుట్టు ఎలా ఉంటుందో మామూలుగా వెంకటేష్ గారి జుట్టు కూడా అలాగే ఉంటుందని కానీ సినిమా హీరో కాబట్టి కాస్త మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉందని రాఘవ పేర్కొన్నారు.
Also Read: Pathaan Film : షారుక్ ఖాన్ తన కూతురితో కూర్చుని పఠాన్ సినిమా చూడాలట.. అయ్యే పనేనా?
Also Read: 1000 Notes Reentry: 1000 రూపాయల నోట్లు మళ్లీ వస్తున్నాయా? 2వేల నోట్లు బ్యాన్ నిజమేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.