రేణు దేశాయ్‌కు పవన్ శుభాకాంక్షలు

ఇటీవలే నటి రేణూ దేశాయ్‌‌కి ఓ వ్యక్తితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.

Last Updated : Jun 26, 2018, 11:54 AM IST
రేణు దేశాయ్‌కు పవన్ శుభాకాంక్షలు

ఇటీవలే నటి రేణూ దేశాయ్‌‌కి ఓ వ్యక్తితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కాగా..రేణూ నిశ్చితార్థం జరిగిన సందర్భంగా.. సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 'కొత్త జీవితంలో ఆనందంతో అడుగుపెడుతున్న రేణూ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. కొత్త బంధంలో ఆరోగ్యంగా ఉండాలని, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, అంతా మంచే జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తాను' అని ట్వీట్‌లో పవన్ తెలిపారు.

 

కాగా గతవారం జరిగిన నిశ్చితార్థంలో పవన్-రేణు పిల్లలతో పాటు నటి కుటుంబీకులు కొద్దిమంది పాల్గొన్నారు. తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు రేణు దేశాయ్ కొద్ది రోజుల క్రితం వెల్లడించారు. అయితే ఆ వ్యక్తి ఎవరన్న విషయం మాత్రం వెల్లడించలేదు.

తెలుగులో ‘జానీ’, ‘బద్రీ’ చిత్రాల్లో పవన్ కల్యాణ్‌ సరసన నటించిన రేణు దేశాయ్.. 2009లో పవన్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు- అకీరా, ఆద్య. వ్యక్తిగత కారణాల వల్ల 2012లో రేణూ, పవన్‌ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్‌.. ఆన్నా లెజ్నోవా అనే రష్యా యువతిని పెళ్లిచేసుకున్నారు.

Trending News