Telangana Congress: రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు.. ఏకమైన కాంగ్రెస్ సీనియర్ నేతలు.. మధ్యలో కోమటిరెడ్డి నుంచి ఫోన్

Political War In Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల కేటాయింపు చిచ్చు రేపుతోంది. తమకు అన్యాయం జరిగిందంటూ పార్టీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో నేడు భేటీ అయి.. భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2022, 03:00 PM IST
Telangana Congress: రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు.. ఏకమైన కాంగ్రెస్ సీనియర్ నేతలు.. మధ్యలో కోమటిరెడ్డి నుంచి ఫోన్

Political War In Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం ముదురుతోంది. రోజుకో నేత అసమ్మతి గళం వినిపిస్తూ కాక రేపుతున్నారు. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీనియర్లు తిరుగుబాటు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ భేటీకి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మధు యాష్కీ, కోదండా రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితర సీనియర్ నేతలు హాజరయ్యారు. ఇటీవల పార్టీ అధిష్టానం ప్రకటించిన కొత్త కమిటీలపై టీకాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తమను సంప్రదించకుండానే కమిటీలు ఏర్పాటు చేశారని మండిపడుతున్నారు. 

సేవ్ కాంగ్రెస్ పేరుతో శనివారం కీలక సమావేశం నిర్వహించారు సీనియర్ నేతలు. అంతాకలిసి ముక్తకంఠంతో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే కుట్ర జరుగుతోందని సీనియర్లు మండిపడ్డారు. పార్టీని హస్తగతం చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. వలస వచ్చిన వారికే  పీసీసీ కమిటీల్లో పదవులు ఇచ్చారని అన్నారు. కొత్తగా నియమించిన కమిటీల్లోని 108 మందిలో 54 మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారేనని చెప్పారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పోస్టులు కూడా వలస నేతలకు ఇచ్చారని సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన కాంగ్రెస్ వాదులను కోవర్టులుగా ప్రచారం చేస్తున్నారని భగ్గుమన్నారు. సొంతపార్టీ వారిపైనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి.. తమను బలహీనపరిచే కుట్ర చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్ సీనియర్ల సమావేశం జరుగుతుండగానే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. భట్టి విక్రమార్కకు ఫోన్ చేశారు. తాను సైతం మీ వెంటే ఉంటానని.. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతు ఉంటుదని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా త్వరలో ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భట్టి నివాసంలో జరిగిన సమావేశంలో ఢిల్లీకి వెళ్లాల్సిన తేదీ, హైకమాండ్ కు నివేదించాల్సిన విషయాలపై కాంగ్రెస్ నేతలు చర్చించారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో వరుసగా జరుగుతున్న పరిణామాలతో కేడర్‌లో గందరగోళం కనిపిస్తోంది. అసమ్మతి నేతల కదలికలను రేవంత్ రెడ్డి టీమ్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది.

Also Read: IND vs BAN: విరాట్ కోహ్లీ పొరపాటు.. సూపర్ క్యాచ్ అందుకున్న రిషబ్ పంత్ 

Also Read: Semester System: ఏపీలో ఇక నుంచి సరికొత్త విధానం.. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్‌ పద్ధతి  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News