Upasana Konidela Pregnancy ఉపాసన కొణిదెల తల్లి కాబోతోందనే వార్త మెగా అభిమానులకు ఎంతటి సంతోషాన్ని ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రామ్ చరణ్‌కి త్వరలోనే వారసుడు రాబోతోన్నాడే వార్త అందరిలోనూ ఆనందాన్ని నింపేసింది.
ఉపాసన, రామ్ చరణ్‌లకు వివాహం జరిగి దాదాపు పదేళ్లు కావొస్తుంది. వీరికి పిల్లలు ఎప్పుడు పుడతారు? అంటూ అందరూ రకరకాలుగా మాట్లాడేవారు.
తల్లి కావడంపై, పిల్లల్ని కనడంపై తమకు ఓ క్లారిటీ ఉందని, అది తమ పర్సనల్ విషయం అని, వాటి గురించి అందరికీ చెప్పాల్సిన పని లేదని ఉపాసన మీడియాతో ఆ మధ్య మాట్లాడిన సంగతి తెలిసిందే.
ఉపాసన ప్రస్తుతం తల్లి కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ప్రకటించాడు. దీంతో కామినేని, కొణిదెల ఫ్యామిలీల్లోనే కాకుండా మెగా అభిమానుల్లో సందడి నెలకొంది.
ఉపాసన తన కామినేని కుటుంబంతో కలిసి కనిపిస్తోంది. తన తల్లి, అమ్మమ్మ అంటూ ఇలా అందరితో సందడి చేస్తోంది.
తమ ఇంట్లోని ఆడవాళ్లందరి ఆశీర్వాదం వల్లే ఇలా నేను మాతృత్వ దశలోకి రాబోతోన్నాను.. అత్తమ్మను మిస్ అవుతున్నా అంటూ ఉపాసన చెప్పుకొచ్చింది.