Dhamaka Telugu Trailer: దుమ్ము రేపిన మాస్ 'ధమాకా'.. ఆ హీరోలు అందరికీ కౌంటరేసిన రవితేజ!

Dhamaka Telugu Movie Trailer Review: రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘’ధమాకా’’ డిసెంబర్ 23వ తేదీన విడుదలయ్యేందుకు రంగం సిద్ధమైన నేపద్యంలో ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే   

Last Updated : Dec 15, 2022, 07:20 PM IST
Dhamaka Telugu Trailer: దుమ్ము రేపిన మాస్ 'ధమాకా'.. ఆ హీరోలు అందరికీ కౌంటరేసిన రవితేజ!

Dhamaka Telugu Movie Trailer Review: రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘’ధమాకా’’. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ప్రసన్నకుమార్ బెజవాడ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి అసోసియేట్ సాయి కృష్ణ కథ అందించడం గమనార్హం. శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీన విడుదలయ్యేందుకు రంగం సిద్ధమైన నేపద్యంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందని చెప్పక తప్పదు. ట్రైలర్లో కొన్ని డైలాగ్స్ ఐతే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.  

కోట్లలో ఒకడు వాడు కొడితే కోలుకోలేవు, మనకు కావలసిన వారికి చేస్తే మోసం మనం కావాలి అనుకున్న వారి కోసం చేస్తే న్యాయం అంటూ కొన్ని డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక సినిమా ట్రైలర్ ను బట్టి చూస్తే ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు. శ్రీ లీల ఈ విషయాన్ని సినిమా ట్రైలర్లో క్లారిటీ వచ్చేలా చెప్పేసింది.

ఒకరు తన ఫ్రెండ్ అన్నయ్య అని మరొకరు తండ్రి ఫ్రెండ్ కొడుకు అని వారిద్దరూ తనకి నచ్చారు అంటూ తల్లితో చెబుతున్న వ్యవహారం చూస్తుంటే ఇదేదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ లా కనిపిస్తోంది. అయితే హీరోయిన్ ఇద్దరినీ ఇష్టపడడం మరింత ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ సినిమా ట్రైలర్ లో తనదైన మాస్ అప్పియరెన్స్ తో రెచ్చిపోయారు రవితేజ. ఇక ట్రైలర్ చివరిలో నేను వెనకున్న వాళ్లను చూసుకుని ముందుకొచ్చిన వాడిని కాదురోయ్, వెనుక ఎవరూ లేకపోయినా ముందుకు రావచ్చు అని ఎగ్జాంపూర్ సెట్ చేసిన వాడిని అంటూ చెప్పడంతో నెపో స్టార్స్ అందరికీ ఆయన కౌంటర్ ఇచ్చారని అంటున్నారు. ఇక మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ట్రైలర్ మీద ఒక లుక్కు వేసేయండి మరి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 
 

Trending News