IAF exercises: తుర్పు సెక్టార్ లో భారత వాయు సేన రెండు రోజుల పాటు యుద్ధ విన్యాసాలను నిర్వహించనుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించనున్న ఈ యుద్ధ విన్యాసాల్లో ఫైటర్ జెట్స్, సుఖోయ్ యుద్ధ విమానం, రాఫెల్ యుద్ధ విమానాలు, మానవరహిత విమానాలు పాల్గొననున్నాయి.
IAF exercises: వాస్తవాధీన రేఖ వెంట వాయుసేన పని తీరు పరిశీలించేందుకు ఈస్ట్ కమాండ్ ఈ యుద్ధ విన్యాసాలను నిర్వహిస్తోంది. ఇటీవల తవాంగ్ సెక్టార్లో చైనా సైనికులతో ఘర్షణ అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ యుద్ధ విన్యాసాలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.