Anurag Kashyap: కాంతారాపై వివాదాస్పద వ్యాఖ్యలు, ఇలాంటి సినిమాలే ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయి

Anurag Kashyap: ప్రస్తుతం దేశంలో పాన్ ఇండియా క్రేజ్ నడుస్తోంది. పుష్ప, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ సినిమాల తరువాత కాంతారా సినిమా. ఓ వైపు పాన్ ఇండియా సినిమాలు భారీ విజయం సాధిస్తున్నా..విమర్శలు చేసేవాళ్లు చేస్తూనే ఉన్నారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 12, 2022, 07:08 PM IST
Anurag Kashyap: కాంతారాపై వివాదాస్పద వ్యాఖ్యలు, ఇలాంటి సినిమాలే ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయి

తాజాగా బాలీవుడ్ స్టార్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంతారా వంటి సినిమాలు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయంటూ వివాదం రేపారు. ఆ వివరాలు మీ కోసం..

ఇటీవల గత కొద్దికాలంగా దేశవ్యాప్తంగా దక్షిణాది సినిమాల హవా నడుస్తోంది. అది కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బాలీవుడ్‌లో భారీ కలెక్షన్లు వసూలు చేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా, పుష్ప, కేజీఎఫ్ ఈ కేటగరీలోనివే. బడ్జెట్, నటీనటులతో సంబంధం లేకుండా కంటెంట్ బాగున్న చిత్రాలకు ఉత్తరాదిన మంచి ఆదరణ లభిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల విడుదలైన కాంతారా సినిమా దేశవ్యాప్తంగా భారీ విజయం నమోదు చేసింది. 

ఈ క్రమంలో కాంతారా సినిమాపై స్టార్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సైరత్ సినిమా మరాఠీ పరిశ్రమను నాశనం చేసిందని దర్శకుడు నాగరాజు మంజులే చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా అనురాగ్ కశ్యప్ గుర్తు చేశాడు. కాంతారా వంటిస సినిమాల కారణంగా ఇండస్ట్రీ నాశనమౌతోందని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలు విజయం సాధించడంతో బాలీవుడ్ పరిశ్రమ కుదేలవుతోందన్నాడు. దీనికి కారణం పాన్ ఇండియా కల్చర్ కొనసాగడమే.

పాన్ ఇండియా కల్చర్ కారణంగా దర్శక నిర్మాతలు ఆ ట్రెండ్‌పైనే దృష్టి సారించడం వల్ల బాలీవుడ్ నష్టపోతోందన్నాడు అనురాగ్ కశ్యప్. కొన్ని సినిమాలు దేశవ్యాప్తంగా విజయం సాధించినా..వాటిని కాపీ చేసి పాన్ ఇండియా సినిమాలు చేస్తే బాలీవుడ్‌కు నష్ట తప్పదని అనురాగ్ కశ్యప్ హెచ్చరిస్తున్నారు. ఇండస్ట్రీ బాగుండాలంటే..ఎప్పుడూ ధైర్యం చెప్పే సినిమాలు, కధల్లో కొత్తదనం ఉండాలన్నాడు.

Also read; Unstoppable With NBK : ప్రభాస్‌ను అలా పిలిచిన బాలయ్య.. ఎపిసోడ్ అంతా అంతేనట

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News