Sula Vineyards IPO Opens Today: మన దేశంలోనే అతిపెద్ద వైన్ తయారీ సంస్థ సులా వైన్‌యార్డ్స్ ఐపీఓ నేటి నుంచి పెట్టుబడులకు తెరలేచింది. సులా వైన్స్‌యార్డ్స్ ఐపీఓ సోమవారం నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు పెట్టుబడులు ఆహ్వానిస్తోంది. ఒక్కో షేరు ధరను రూ.340 నుంచి రూ.357గా నిర్ణయించింది. పెట్టుబడిదారులు కనీసం 42 ఈక్విటీ షేర్ల కోసం వేలం వేయవచ్చు. ఐపీఓ ద్వారా కంపెనీ మార్కెట్ నుంచి రూ.960 కోట్లు సమీకరించబోతోంది.
ఈ షేర్ డిసెంబర్ 22న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బీఎస్ఈలో లిస్ట్ అవుతుంది. ఆఫర్ ఫర్ సేల్ కింద సుల వైన్‌యార్డ్స్ ఐపీఓలో 2.69 కోట్ల షేర్లను విక్రయించబోతోంది. కంపెనీ ఇన్వెస్టర్లు ఐపీఓలో తమ షేర్లను విక్రయిస్తున్నారు. అయితే ఐపీఓలో వచ్చే మొత్తం కంపెనీకి అందదు. కానీ వాటాదారులకు వెళ్తుంది. డిసెంబర్ 9న యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.288.10 కోట్లు సేకరించింది.
40 రూపాయలతో ట్రేడ్..
సులా వైన్‌యార్డ్స్ షేర్ గ్రే మార్కెట్‌లో రూ.40 ప్రీమియంతో ట్రేడవుతోంది. అంటే దీని ప్రకారం షేర్ దాదాపు రూ.400 లిస్ట్ చేయవచ్చని మార్కెట్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయితే.. స్టాక్స్‌లో లిస్టయిన దేశంలోనే మొట్టమొదటి వైన్ తయారీ కంపెనీగా నిలుస్తుంది. వైన్ టూరిజం రంగంలో ప్రముఖ కంపెనీల్లో సులా వైన్స్‌యార్డ్ ఒకటి. మహారాష్ట్రలోని నాసిక్‌లో రెండు వైన్ రిసార్ట్‌లు కూడా ఉన్నాయి.
1996లో సులా వైన్‌యార్డ్స్ కంపెనీని స్థాపించారు. 2021-22లో సులా వైన్‌యార్డ్స్ ఆదాయం రూ.453.92 కోట్లు కాగా లాభం రూ.52.14 కోట్లు. 2020-21లో ఆదాయం రూ.417.96 కోట్లు, లాభం రూ.3.01 కోట్లు. సులా వైన్స్‌యార్డ్స్ 13 బ్రాండ్ పేర్లతో 56 రకాల లేబుల్ వైన్‌లను ఉత్పత్తి చేస్తోంది. వైన్ మార్కెట్‌లోని దిగ్గజాలలో కంపెనీ ఒకటి. కోటక్ మహీంద్రా క్యాపిటల్, CLSA ఇండియా, IIFL సెక్యూరిటీస్ IPOకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి.
Also Read: Happy Birthday Rajinikanth: రజినీకాంత్ కోసం శ్రీదేవి ఏడు రోజులు ఉపవాసం.. కారణం తెలుసా..!
Also Read: Nalgonda Bus Accident: నల్గొండ జిల్లాలో బస్సు బస్సు బోల్తా.. 20 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook