PF Balance Withdrawal Online: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) మొత్తాన్ని ఆన్‌లైన్ ప్రాసెస్ ద్వారా విత్‌డ్రా చేసుకునే విషయం అందరికీ తెలిసిందే. ఈపీఎఫ్ఓ మెంబర్ ఇ-సేవా పోర్టల్ డబ్బులు తీసుకోచ్చు. అదేవిధంగా ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత పీఫ్‌లో తమ పొదుపు మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. లేదంటే అత్యవసర సమయంలో కొంత మొత్తాన్ని కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు.
అయితే పీఎఫ్ డబ్బును ఆన్‌లైన్‌లో ఎలా విత్ డ్రా చేయాలో చాలా మందికి తెలియదు. పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేసే ప్రక్రియ కోసం చాలా ఉద్యోగులు పక్క వారిని అడగడం మీరు చూసే ఉంటారు. ఇక నుంచి పక్కవాళ్ల ఆధారపడకుండా కింది స్టెప్స్ ఫాలో అయిపోండి. ఆన్‌లైన్‌లో సులభంగా పీఎఫ్ డబ్బులు ఉపసంహరించుకోండి.
ఆన్‌లైన్ పీఎఫ్ ఉపసంహరణ ప్రక్రియ ఇలా..
- అధికారిక యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) పోర్టల్‌కి వెళ్లండి
- మీ యూఎన్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి
- ధృవీకరణ కోసం అక్కడ చూపించిన కోడ్‌ను నమోదు చేయండి
- 'ఆన్‌లైన్ సేవలు' ట్యాబ్‌కు వెళ్లి.. డ్రాప్-డౌన్ మెను నుంచి 'క్లెయిమ్ (ఫారం 19, 31, 10C లేదా 10D)' ఎంపికను ఎంచుకోండి
- తదుపరి స్క్రీన్‌లో మీ బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చేసి 'వెరిఫై' బటన్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు 'అవును'పై క్లిక్ చేసి.. ముందుకు సాగండి
- 'ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్'పై క్లిక్ చేయండి
- క్లెయిమ్ ఫారమ్‌లో 'నేను దరఖాస్తు చేయాలనుకుంటున్నాను' ట్యాబ్ కింద మీకు అవసరమైన దావాను ఎంచుకోండి.
- నిధులను ఉపసంహరించుకోవడానికి ఒక ఫారమ్‌ను ఎంచుకోవాలి. దీని కోసం 'పీఎఫ్ అడ్వాన్స్ (ఫారం 31)'ఎంచుకోండి. అప్పుడు అటువంటి ముందస్తు ప్రయోజనం, అవసరమైన మొత్తం, అడ్రస్‌ను ఎంటర్ చేయండి.
- ఈ ఫారమ్‌ను పూరించిన తరువాత.. స్కాన్ చేసిన పత్రాలను సమర్పించమని అడగవచ్చు.
- ఉపసంహరణ అభ్యర్థనను కంపెనీ యజమాని ఆమోదించిన తర్వాత.. మీ బ్యాంక్ ఖాతాలో నగదు జమ అవుతుంది.
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. న్యూ ఇయర్‌లో భారీగా పెరగనున్న జీతం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook