Refined Oil Side Effects: ఆరోగ్యం కావాలంటే ఈ 6 నూనెలు తక్షణం దూరం పెట్టాల్సిందే

Refined Oil Side Effects: సదా ఆరోగ్యంగా ఉండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఒత్తిడిని జయించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వంట నూనెల్లో మార్పు అత్యవసరం. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 8, 2022, 04:57 PM IST
Refined Oil Side Effects: ఆరోగ్యం కావాలంటే ఈ 6 నూనెలు తక్షణం దూరం పెట్టాల్సిందే

మార్కెట్‌లో ఎన్నో రకాల వంట నూనెలున్నాయి. ఇవి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంటాయి. ఏవి మంచివి ఏవి కావో తెలుసుకుని దూరం పెట్టకపోతే..నెమ్మది నెమ్మదిగా మృత్యువుకు దారి చూపిస్తాయి. అందుకే సదా ఆరోగ్యంగా ఉండాలంటే 6 రకాల వంట నూనెల్నిమీ కిచెన్ నుంచి తొలగించకతప్పదు..

శరీరాన్ని ఫిట్‌గా ఉంచేందుకు, శరీరంలోపలి అంగాల్నితాజాగా, ఆరోగ్యంగా ఉంచేందుకు నెయ్యి-నూనె అవసరమే. ఎందుకంటే ఇందులో శరీరానికి కావల్సిన విటమిన్లు లభిస్తాయి. అయితే కొన్నిరకాల నూనెలు మాత్రం ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తాయి. మార్కెట్‌లో తక్కువ ధరకు లభించే రిపైండ్ ఆయిల్‌లో కలిసి ఉండే కెమికల్స్ క్రమంగా శరీరాన్ని బలహీనం చేస్తాయి. అందుకే రిఫైండ్ ఆయిల్‌ను క్రమంగా దూరం చేయాలి. ఆ వివరాలు మీ కోసం..

రిఫైండ్ ఆయిల్ అనేది వాస్తవానికి ప్రాకృతిక నూనెకు ప్రెస్డ్ రూపం. అధిక ఉష్ణోగ్రత వద్ద వీటిని రిఫైన్ చేస్తారు. ఇందులో చాలారకాల కెమికల్స్ ఉంటాయి. ఫలితంగా ఇందులో ఉండే పోషకాలు తొలగిపోతాయి. శరీరంలో కొవ్వు శాతాన్ని పెంచుతాయి. ఫలితంగా శరీరంలో హై కొలెస్ట్రాల్, ఇన్సులిన్, ట్రైగ్లిసరాయిడ్స్ స్థాయి పెరిగిపోతుంది. ఫలితంగా హెచ్‌డీఎల్ స్థాయి తగ్గుతుంది. 

ఈ ఆరు రిఫైండ్ ఆయిల్స్ దూరంగా పెట్టాల్సిందే

సోయాబీన్ ఆయిల్, వేరుశెనగ నూనె, కెనాలా నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రౌన్ ఆయిల్, కార్న్ ఆయిల్స్‌ను పూర్తిగా దూరంగా పెట్టాలి. ఈ ఆరు నూనెల్లో ఏ ఒక్క రకం నూనె వాడినా.. స్థూలకాయం, కేన్సర్, గ్యాస్, ఇమ్యూనిటీ తగ్గడం వంటి గంభీరమైన వ్యాధులు చుట్టుముడతాయి. అందుకే సాధ్యమైనంతలో ఈ ఆరు రిఫైండ్ ఆయిల్స్ దూరంగా పెట్టాలి.

రిఫైండ్ ఆయిల్ కంటే ఆవాల నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, నెయ్యి వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది. వీటివల్ల శరీరంలో ఏ విధమైన సైడ్‌ఎఫెక్ట్స్ ఉండవు. శరీరం అంతర్గతంగా ఫిట్‌గా ఉంటుంది. శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. కొత్త సెల్స్ నిర్మాణం, హార్మోన్ ఉత్పత్తి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.

Also read: Diabetes Diet: ఈ ఆకులతో 7 రోజుల్లో ఎలాంటి ఖర్చు లేకుండా మధుమేహానికి చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News