వెనకబడిన తరగతుల వారికి ఆదుకునేందుకు ఏపీ సర్కార్ మరో కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చింది. 'చంద్రన్న పెళ్లి కానుక' పేరుతో రూపొందించిన ఈ పథకం ద్వారా పెళ్లి ఖర్చుల కోసం ఆడపిల్ల వారికి రూ. 30 వేల ఆర్ధిక సాయం ప్రభుత్వం అందించనుంది. వెనకబడిన తరగతుల పేదవారికి కొత్త సంవత్సరం కానుకగా ఈ పథకాన్ని ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీని కోసం వచ్చే ఏడాది బడ్జెట్ లో రూ.300 కోట్ల కేటాయించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ, మైనార్టీలకు ఇలాంటి పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
అర్హతలు:
* దారిద్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలై తెలుపు రేషన్ కార్డు ఉండాలి.
* వివాహం చేసుకునే వధువు వయస్సు 18 ఏళ్లు, వరుడి వయస్సు 21 ఏళ్లు పూర్తయి ఉండాలి
* మీసేవా కేంద్రాల్లో జారీ చేసిన కులుధ్రువీకరణ పత్రం తప్పనిసరి
బీసీలకు చంద్రన్న పెళ్లి కానుక !