Nanda Kumar Bail: నంద కుమార్‌కి బెయిల్.. అంతలోనే పిటి వారంట్ కావాలన్న పోలీసులు

Nanda Kumar Bail: నంద కుమార్‌ఫై ఇందిర కోన అనే మరో మహిళ ఫిర్యాదు చేశారని.. ఆమే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నందున ఆ కేసులో నంద కుమార్‌పై పిటి వారెంట్ కావాలని బంజారాహిల్స్ పోలీసులు కోర్టును కోరారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2022, 11:52 AM IST
  • టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న నందకూమార్‌కి మరో కేసులో బెయిల్
  • ఫోర్జరీ కేసులో నిందితుడిగా ఉన్న నంద కుమార్
  • మరో కేసులో పిటి వారెంట్ కావాలన్న పోలీసులు
Nanda Kumar Bail: నంద కుమార్‌కి బెయిల్.. అంతలోనే పిటి వారంట్ కావాలన్న పోలీసులు

Nanda Kumar Got Bail : ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు మూడు రోజుల క్రితమే బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ముగ్గురిలో ఒకరైన నంద కుమార్ మాత్రం బంజారాహిల్స్ పిఎస్ పరిధిలో నమోదైన ఫోర్జరీ కేసులో ఇంకా లోపలే ఉన్నాడు. తాజాగా శనివారం నాడు ఆ కేసులోనూ నంద కుమార్ కి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 10 వేల రూపాయల పూచికత్తుతో రెండు షూరిటీలు సమర్పించాలని నాంపల్లి కోర్టు నంద కుమార్‌కి స్పష్టంచేసింది.

ఇదిలావుంటే, నంద కుమార్‌ఫై ఇందిర కోన అనే మరో మహిళ ఫిర్యాదు చేశారని.. ఆమే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నందున ఆ కేసులో నంద కుమార్‌పై పిటి వారెంట్ కావాలని బంజారాహిల్స్ పోలీసులు కోర్టును కోరారు. అయితే, బంజారాహిల్స్ పోలీసుల విజ్ఞప్తిపై స్పందించిన నాంపల్లి కోర్టు.. నంద కుమార్‌పై ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు అయ్యాయో పూర్తి వివరాలు అందించాల్సిందిగా పోలీసులకు స్పష్టంచేసింది. అయితే, ఒక కేసులో బెయిల్ లభించగానే.. నంద కుమార్‌ను అదపులోకి తీసుకోవడానికి మరో కేసు రెడీగా ఉంటుండటంతో ఇప్పట్లో అతడికి బయటికి వచ్చే అవకాశాలు లేనట్టేనా అనే వార్తలొస్తున్నాయి.

మరోవైపు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు, కొనుగోలుకు యత్నం కేసులోనూ నంద కుమార్ వద్ద లభించిన చాటింగ్ చిట్టాను చూస్తే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో మాత్రమే కాకుండా అతడు కాంగ్రస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతల పేర్లతోనూ ఓ జాబితాను సిద్ధం చేసుకున్నట్టు వచ్చిన వార్తలు పెను సంచలనం సృష్టించాయి. ఇప్పటివరకు ఈ పొలిటికల్ డ్రామాతో తమకు ఎలాంటి ముప్పు లేదనుకున్న కాంగ్రెస్ పార్టీని నంద కుమార్ ( TRS MLAs poachng case accused ) వద్ద వెలుగుచూసిన చాటింగ్, జాబితాలు షాక్‌కి గురయ్యేలా చేశాయి.

Also Read : Kavitha Flexies: డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫియర్.. కవితకు మద్దతుగా ఫ్లెక్సీలు!

Also Read : Harish Rao: ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్ధానం ఏమైందన్న మంత్రి హరీశ్ రావు

Also Read : Pawan Kalyan: నేనొక ఫెయిల్యూర్ పొలిటీషియన్..జనసేనాని వ్యాఖ్యలు వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News