Pakistan Vs England Updates: పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం నుంచి తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. రావల్పిండి క్రికెట్ స్టేడియంలో మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఏ ఆటగాడిని మీ రోల్ మోడల్‌గా భావిస్తున్నారని బాబర్‌ను అడిగాడు. దీనిపై అతను చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు.
బాబర్ ఆజమ్ మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచి ఏబీ డివిలియర్స్‌కి అభిమానిని అని చెప్పాడు. "ఏబీని టీవీలో చూసేవాడిని. నేను ఫీల్డ్‌కి వెళ్లినప్పుడు డివిలియర్స్‌ను కాపీ కొట్టాను. అతను ఆడే విధానం.. అద్భుతమైన షాట్లను నేను ఇష్టపడతాను. నేను ఏబీలా ఆడేందుకు ప్రయత్నించాను.." అంటూ బాబర్ చెప్పుకొచ్చారు.
Nasser Hussain interviews Babar Azam ahead of the start of Pakistan vs England Test series 🎙️#PAKvENG | #UKSePK pic.twitter.com/lo3AvT7UMZ
— Pakistan Cricket (@TheRealPCB) November 29, 2022
అయితే ఎందుకంటే 2018లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని తన హీరోగా చెప్పాడు బాబర్ ఆజామ్. "విరాట్ కోహ్లీ నాకు ఆదర్శం. నేను అతని బ్యాటింగ్ శైలిని అనుసరిస్తాను. క్రీజులోకి వచ్చిన ఆత్మవిశ్వాసమే కోహ్లిలోని గొప్పదనం. పరుగుల ఆకలితో మునుపెన్నడూ సాధించనట్లుగా ప్రతి ఇన్నింగ్స్‌లో ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు.." అంటూ కోహ్లీ గురించి గొప్పగా చెప్పాడు. కానీ ఇప్పుడు డివిలియర్స్ తనకు ఆదర్శమని మాట మార్చాడు.
17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్‌లో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇంగ్లండ్‌కు చెందిన 14 మంది ఆటగాళ్లు అనారోగ్యానికి గురయ్యారని వార్తలు వచ్చాయి, కానీ ఇప్పుడు అంతా బాగానే ఉంది. మ్యాచ్ నిర్ణీత సమయానికి ప్రారంభమైంది. ఇంగ్లండ్ ఓపెనర్లు డ్యూకెట్ (43), క్రెవ్లీ (60) మంచి ఆరంభాన్నిచ్చారు. ప్రస్తుతం ఇంగ్లండ్ వికెట్ కోల్పోకుండా 106 పరుగులు చేసింది.
Also Read: Gujarat Elections: గుజరాత్ ఎన్నికల్లో ఓటు వేయనున్న మినీ ఆఫ్రికా ప్రజలు.. గ్రామం అంతా సంబరాలు
Also Read: 7th pay commission: కేంద్ర ఉద్యోగులకు మరో బంపర్ గిఫ్ట్.. ట్రావెల్ అలవెన్స్ పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook