Pistachio Benefits: అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని కాపాడడానికి డ్రై ఫ్రూట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇందులో పుష్కలంగా పోషకాలు లభిస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లో ఉండే గుణాలు సీజనల్ వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి చలి కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పిస్తా పలుకులను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో కేలరీల పరిమాణాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తింటే శరీర బరువు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా సులభంగా తగ్గుతాయి.
పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. చర్మం, జుట్టు సమస్యలకు చెక్:
చలికాలంలో చాలా వరకు చర్మం, జుట్టు సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి చాలా మంచిది. అయితే దీని కోసం పిస్తాపప్పులు తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వీటిని తరచుగా తీసుకుంటే చర్మం మృదువుగా, మెరిసేలా తయారవుతుంది.
2. జీర్ణక్రియ సమస్యలన్నీ తగ్గుతాయి:
పొట్ట సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా పిస్తాపప్పులను తినాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు మెరుగుపడతాయి. అంతేకాకుండా ఇవి గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం, అసిడిటీ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
3. బరువును తగ్గిస్తుంది:
బరువు పెరగడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పిస్తాలు దివ్యౌషధంల పని చేస్తాయి. ఇందులో చాలా పరిమాణాల్లో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.
4. డయాబెటిస్:
మన దేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే మధుమేహంతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా పిస్తాపప్పులను తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గుతాయి. అంతేకాకుండా ఇందులో తక్కువ కేలరీలు, తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉండడం వల్ల మధుమేహం సులభంగా నియంత్రణలో ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Watch Now: కాటేసే నాగరాజుకే కిస్ ఇచ్చిన బలరాజు..నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్న వైరల్ వీడియో..
Also Read : Rhino In Football Ground: ఫుట్‌బాల్ గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఖడ్గమృగం.. ఆటగాళ్లు ఏం చేశారో చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook