Delhi MCD Election 2022: అరవింద్ కేజ్రీవాల్ హత్యకు బీజేపి కుట్ర ?

Delhi MCD Election 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు త్వరలోనే జరగనున్న ఢీల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఓడిపోతామని బీజేపికి భయం పట్టుకుంది. ఆ భయంతోనే ఇలా అరవింద్ కేజ్రీవాల్ ని అడ్డం తొలగించుకునేందుకు కుట్రలకు తెరతీస్తోందని మనీష్ సిసోడియా ఆందోళన వ్యక్తంచేశారు.

Written by - Pavan | Last Updated : Nov 25, 2022, 08:02 AM IST
  • సమీపిస్తున్న ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు
  • బీజేపి, ఆప్ మధ్య వేడెక్కిన ఢిల్లీ రాజకీయం
  • పరస్పర తీవ్ర ఆరోపణలు గుప్పించుకుంటున్న నేతలు
Delhi MCD Election 2022: అరవింద్ కేజ్రీవాల్ హత్యకు బీజేపి కుట్ర ?

Delhi MCD Election 2022: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపిపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కీలక నేత అరవింద్ కేజ్రీవాల్ ని హతమార్చేందుకు బీజేపి కుట్ర పన్నుతోందని మనీష్ సిసోడియా ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ హత్యకు కుట్రలో ఢిల్లీ బీజేపి నేత మనీష్ తివారి కూడా పాల్పంచుకుంటున్నారని మనీష్ సిసోడియా పేర్కొన్నారు. 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు త్వరలోనే జరగనున్న ఢీల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఓడిపోతామని బీజేపికి భయం పట్టుకుంది. ఆ భయంతోనే ఇలా అరవింద్ కేజ్రీవాల్ ని అడ్డం తొలగించుకునేందుకు కుట్రలకు తెరతీస్తోందని మనీష్ సిసోడియా ఆందోళన వ్యక్తంచేశారు.

ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు టికెట్లు అమ్ముకుని భారీ ఎత్తున అవినీతికి పాల్పడిన అరనింద్ కేజ్రీవాల్ కి సెక్యురిటీ కష్టమే అంటూ ఢిల్లీ యూనిట్ బీజేపి నేత మనోజ్ తివారి వ్యాఖ్యనించిన నేపథ్యంలోనే మనీష్ సిసోడియా ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. 

 

మనిష్ సిసోడియా ఆరోపణలను సుమొటోగా స్వీకరించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సెనా.. సిసోడియా ఆరోపణలపై విచారణ జరిపించాల్సిందిగా ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. 

ఇదిలావుంటే, అంతకంటే ముందు మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ బీజేపిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ మునిసిపల్ పీఠంపై 15 ఏళ్లు కూర్చున్న బీజేపి.. ఢిల్లీలో కనీసం పరిసరాల పరిశుభ్రత పాటించలేకపోయారని.. అందుకే ఈ ఎన్నికల్లో ఢిల్లీ జనం బీజేపి తగిన విధంగా బుద్ధి చెబుతారని మండిపడ్డారు.

Also Read : Extra Marital Affairs: వివాహేతర సంబంధం.. ప్రైవేట్ పార్ట్స్‌పై ఫెవిక్విక్ పోసి చంపాడు

Also Read : Aayushi Chaudhary Murder Case: వీడిన ఆయూషి చౌదరి మర్డర్ మిస్టరీ.. కిల్లర్స్ ఎవరో కాదు..

Also Read : Ration Card: రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఆ కార్డులు మొత్తం రద్దు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News