తనని హతమారుస్తానని బెదిరిస్తూ రవి పూజారి అనే గ్యాంగ్ స్టర్ నుంచి గత మూడు రోజులుగా ఫోన్ కాల్స్ వస్తున్నట్టు ఆరోపించారు ప్రముఖ సామాజిక కార్యకర్త, గుజరాత్లో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన దళిత నేత జిగ్నేష్ మెవాని. ఆస్ట్రేలియా నుంచి తనని తాను గ్యాంగ్ స్టర్ రవి పూజారిగా పరిచయం చేసుకుంటున్న ఓ వ్యక్తి గత మూడు రోజులుగా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని, మూడో రోజైన ఈ రోజు తన పాత నెంబర్కి ఆ కాల్ వచ్చిందంటూ జిగ్నేష్ మెవాని ట్విటర్ ద్వారా ప్రకటించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు ఆపకపోతే కాల్చి చంపేస్తానని, ఉమర్ ఖలీద్ కూడా తన హిట్ లిస్ట్ జాబితాలో ఉన్నాడని సదరు గ్యాంగ్స్టర్ టెక్ట్స్ మెసేజ్ కూడా పంపించినట్టు జిగ్నేష్ మెవాని తన ట్వీట్లో పేర్కొన్నారు.
Day 3, threat call continues from Ravi Pujari. Today again I received a threat call on my original number from a person introducing himself as Ravi Pujari frm Australia and also sent a text saying - "stop giving provocative speeches or will shot you. Umar Khalid is also in list"
— Jignesh Mevani (@jigneshmevani80) June 8, 2018
తనకి తరచుగా బెదిరింపు కాల్స్, సందేశాలు రావడంపై జిగ్నేష్ మెవాని స్పందిస్తూ ఈ కుట్ర వెనుక బీజేపీ హస్తం ఉందని అనుమానిస్తున్నట్టు తెలిపారు. తనని హతమార్చడం ద్వారా బీజేపీ తమకు ఎదురులేకుండా చేయాలని కుట్ర పన్నుతోందని మెవాని ఆరోపించారు. దళిత ఎమ్మెల్యే అయిన జిగ్నేష్ మెవాని చేసిన ఈ ఆరోపణలపై బీజేపీ ఏమని స్పందిస్తుందో చూడాలి మరి.
+75397326097 नंबर से फ़ोन आया है और +60176206085 से मैसेज आया है - Yeh Jo Provocative Speeches Dena Bandh Kar Warna Tok Dunga. Umar Khalid Bi Mere Hit List Me he. yeh mere Tarpshe warning .MAFIA DON RAVI POOJARY
— Jignesh Mevani (@jigneshmevani80) June 8, 2018
मुजे मिल रही धमकियां एक सरकारी साज़िश? क्योंकि यदि कोई रवि पूजारी हमे मार डाले तब तो भाजपा का काम आसान हो जायेंगा। अंबेडकरवादी आंदोलन पर हमला करने की भी यह चाल लग रही है।
— Jignesh Mevani (@jigneshmevani80) June 8, 2018