వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని కొత్త జిల్లాలకు కొత్త అధ్యక్షులతో పాటు..రీజనల్ కో ఆర్డినేటర్లను కూడా నియమించింది. డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పార్టీ అనుబంధ విభాగాల కో ఆర్డినేటర్‌గా నియమిస్తూ..పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ వి విజయసాయిరెడ్డికి సహాయకారిగా ఉంటారని పార్టీ వెల్లడించింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త రీజనల్ కో ఆర్డినేటర్లు
1. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల కో ఆర్డినేటర్‌గా మంత్రి బొత్స సత్యనారాయణ నియమితులయ్యారు.
2. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల కో ఆర్డినేటర్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు.
3. కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల కో ఆర్డినేటర్లుగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మిధున్ రెడ్డిలు నియమితులయ్యారు.
4. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కో ఆర్డినేటర్లుగా మర్రి రాజశేఖర్ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డిలు నియమితులయ్యారు.
5. పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల కో ఆర్డినేటర్లుగా బీద మస్తాన్ రావు, భూమన కరుణాకర్ రెడ్డిలు నియమితులయ్యారు.
6. నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల కో ఆర్డినేటర్‌గా బాలినేని శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు.
7. అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లా కో ఆర్డినేటర్‌గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియమితులయ్యారు.
8. కర్నూలు, నంద్యాల జిల్లాల కో ఆర్డినేటర్‌గా ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి నియమితులయ్యారు.
వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతల్నించి సజ్జల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లను తప్పించారు. ఈ నలుగురికి ఇతర బాధ్యతలు అప్పగిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.
Also read: AP High Court: ఇప్పటం పిటీషనర్లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం, ఒక్కొక్కరికి లక్షరూపాయలు జరిమానా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook