Babar Azam Trolled with SKY Caption: పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టేన్ బాబర్ ఆజంను టీమిండియా ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సూర్య కుమార్ యాదవ్ ఫ్యాన్స్ అయితే బాబర్ ఆజంను టీజ్ చేస్తున్న తీరు గురించి ఇక చెప్పనక్కరే లేదు. ఇండియన్స్ మాత్రమే కాదండోయ్.. స్వయంగా బాబర్ ఆజం ఫ్యాన్స్, పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ సైతం టీజ్ చేస్తున్నారు. ఇంతకీ బాబర్ ఆజం అంతగా చేసిన తప్పేంటి ? ఎందుకు, బాబర్ ఆజంను అంతగా వేధిస్తున్నారు ?
బాబర్ ఆజం చేసిన ఒక ట్వీటే అతడిని ట్రోల్ చేసేందుకు కారణమైందంటే నమ్ముతారా ? ఇంతకీ బాబర్ చేసిన ఆ ట్వీట్ ఏంటి ? అంతలా అందులో ఏముంది అనే సందేహం వచ్చే ఉంటుంది. కదా.. ఆ.. అక్కడికే వస్తున్నాం. టీ20 వరల్డ్ కప్ ముగించుకుని రిలాక్స్ అవుతున్న బాబర్ ఆజం తాజాగా ట్విటర్‌లో ఓ ఫోటో పోస్ట్ చేసి ఆ ఫోటోకు ఓ క్యాప్షన్ పెట్టాడు. ఆ క్యాప్షన్ ఏంటంటే.. రిలాక్సింగ్ అండర్ ది బ్లూ స్కై ( Relaxing Under SKY) అని.
Relaxing under the blue sky 😎 pic.twitter.com/M78Lh9xLGJ
— Babar Azam (@babarazam258) November 23, 2022
బాబర్ ఆజం ఉద్దేశం ఆ నీలాకాశం కింద సేద తీరుతున్నాను అని. కానీ ఆ మూడు పదాల్లో చివరిదైన స్కై అనే పదం షార్ట్ కట్‌లో సూర్యకుమార్ యాదవ్‌ని కూడా సూచిస్తుండటంతో ఇండియన్స్ ఆ ట్వీట్‌ని సూర్య కుమార్ యాదవ్‌కి లింక్ చేస్తూ బాబర్‌ని ట్రోల్ చేశారు.
Context 😊 pic.twitter.com/0tvzZQ5d5u
— YouAreWrong🇦🇷🇧🇪 (@huihui_____) November 23, 2022
ఐసిసి ప్రకటించిన టీ20 బ్యాట్స్‌మేన్ జాబితాలో సూర్య కుమార్ యాదవ్ నెంబర్ 1 స్థానంలో ఉండగా పాకిస్థాన్ బ్యాట్స్ మేన్ మొహమ్మద్ రిజ్వాన్ రెండో స్థానంలో, అలాగే బాబర్ ఆజం నాలుగో స్థానంలో ఉన్నారు. అలా ఈ జాబితాలో బాబర్ ఆజం కూడా సూర్య కుమార్ యాదవ్ కిందే ఉండటంతో '' రిలాక్సింగ్ అండర్ స్కై " అనే క్యాప్షన్‌ని ఐసిసి టీ20 బ్యాట్స్ మేన్ ర్యాంకింగ్స్‌కి ముడిపెడుతూ " నువ్వు ఎప్పుడూ స్కై కిందే రిలాక్స్ అవుతూ ఉండు " అంటూ నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు.
King, i think this's a worrying part. This tummy doesn't look good. After all u r the best, so wud like u to work on ur fitness a bit more. Plus why to fix a limit when u want to rule the world,so push urself to next level fitness. Don't stop & best of luck for ur future..The 🐐 pic.twitter.com/BRAP31jW2O
— Em Bee (@wagonR1328) November 23, 2022
బాబర్ ఆజంను ట్రోల్ చేయడానికి మరో కారణం కూడా ఉంది. బాబర్ ఆజం పోస్ట్ చేసిన ఫోటోలో అతడికి కొద్దిగా పొట్ట వచ్చినట్టుగా కనిపిస్తోంది. దీంతో ఆ పొట్టను తగ్గించుకుంటే నీ కెరీర్‌కి , నీ ఫిట్‌నెస్‌కి ఇంకా మంచిదని సలహా ఇస్తూ ఇంకొంతమంది ట్రోల్ చేశారు. బాబర్ ఆజం ఫిట్‌నెస్ గురించి ట్రోల్ చేసిన వారిలో పాకిస్థాన్ వాళ్లు కూడా ఉన్నారట. ఒక దేశ క్రికెట్ జట్టు కెప్టేన్‌గా తన పోస్ట్ తనకు లెక్కలేనన్ని లైక్స్, కామెంట్స్ వస్తాయని అనుకున్నాడో ఏమో కానీ ఆ క్యాప్షన్ కాస్తా సూర్య కుమార్ యాదవ్‌ని సూచిస్తుండటంతో తనకు తెలియకుండానే ట్రోల్స్ బారినపడ్డాడు.