ఆ అవమానం జరిగి నేటికి 125 ఏళ్లు

జాతివివక్ష కారణంగా గాంధీజీని రైలు నుంచి దించేసిన ఘటనకు 125 ఏళ్లు నిండాయి.

Last Updated : Jun 7, 2018, 09:47 AM IST
ఆ అవమానం జరిగి నేటికి 125 ఏళ్లు

దక్షిణాఫ్రికాలో గాంధీజీ లాయర్‌గా పనిచేస్తున్న సమయంలో ఓ రైలులో శ్వేతజాతీయులకు కేటాయించిన సీటులో కూర్చున్నందుకు ఆయన్ను అధికారులు బలవంతంగా బయటకు గెంటేశారు. 1893, జూన్ 7న ఈ ఘటన చోటుచేసుకుంది. దీని ప్రభావంతో ప్రజలను సంఘటితపరచడానికి గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఘటనే తర్వాతి కాలంలో గాంధీజీని భారత స్వాతంత్రోద్యమానికి పురికొల్పింది.

జాతివివక్ష కారణంగా గాంధీజీని రైలు నుంచి దించేసిన ఘటనకు 125 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా ప్రభుత్వం మహాత్ముడి సంస్మరణోత్సవాలను మూడురోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా మేకింగ్ ఆఫ్ మహాత్మ చిత్రాన్ని ప్రదర్శించారు.

ఏ రైలు నుంచి  గాంధీని బయటకు గెంటేశారో.. ఏ పీటర్‌ మారిట్జ్‌బర్గ్‌ రైల్వేస్టేషన్‌లో ఆయన పడిపోయారో.. ఆ రైలును, స్టేషన్‌ను ఖాదీతో ప్రత్యేకంగా అలంకరించారు. ఇక ఉత్సవాల్లో భాగంగా చివరి రెండు రోజులపాటు జరిగే కార్యక్రమాల్లో భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మస్వరాజ్ పాల్గొననున్నారు.  ప్రముఖ రాజకీయ నాయకులు సహా 300 మంది ప్రముఖులతో కలిసి పెంట్రిచ్‌ స్టేషన్‌ నుంచి పీటర్‌ మారిట్జ్‌బర్గ్‌ స్టేషన్‌ వరకూ.. ఖాదీతో అలంకరించిన రైలులో ప్రయాణిస్తారు. రెండువైపులా గాంధీజీ ముఖం కనిపించే ఒక విగ్రహాన్ని స్టేషన్‌ ప్లాట్‌ఫాంపై ఆవిష్కరిస్తారు.

 

Trending News