14 Feet Long Python Snake Google Trends Viral Video: సెల్ ఫోన్ అందరి చేతుల్లోకి వచ్చాకా.. సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయింది. ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రతి చిన్న విషయంపై రియాక్ట్ అవ్వగలుగుతున్నారు. అయితే అందులోని వీడియోలు కూడా మనుషులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇందులోని చాలా వీడియోలు వినియోగదారులను ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మనం సోషల్ మీడియాలో వీడియోలు గమనిస్తే చాలా వరకు జంతువులు, పాములకు సంబంధించినవే ఉంటున్నాయి. అయితే వైరలవుతున్న చాలా వీడియోల్లో పాములకు సంబంధించినవే ఉండడం విశేషం.
యుట్యూబ్‌లో వైరల్ అవుతున్న వీడియోల్లో ఎక్కువగా కొండచిలువలకు సంబంధించినవే ఉంటున్నాయి. అయితే ఈ పాములు దక్షిణాన, ఆఫ్రికాలో పలు ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా సంచారం చేస్తూ ఉంటాయి. కొండచిలువలు ఆకలిని తీర్చుకోవడానికి అడవుల్లో ఉండే జంతువులను తింటూ ఉంటాయి. ఇక భారత దేశ విషయానికొస్తే ఎక్కువగా పైథాన్ అడవుల్లో సంచారం చేస్తాయి. సరీసృపాలలో పెద్దగా, భయంకరంగా కనిపించే వాటిల్లో కొండచిలువలే ప్రధానమైనవి. ఈ పాములు దాదాపు 25 అడుగుల నుంచి 14 దాకా ఉంటాయి.
14 అడుగులు కలిగిన పైథాన్స్ ఎక్కువగా అడవుల్లో ఉండే జింకలు, కొండ గొర్రెలు ఇతర జంతువులు తింటాయి. ఇవి అతి భయంకరమైనవి కాబట్టి వీటికి దూరంగా నివాసాలను ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. పైథాన్స్ లను వినియోగదారులు చూసేందుకే ఎక్కువగా ఇష్ట పడుతున్నారు. ఇటివలే ఒక పైథాన్ కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ వైరల్ అవుతున్న వీడియో మీరు గమనిస్తే అందులో ఓ వ్యక్తి ఆ కొండ చిలువను పట్టకునే ప్రయత్నం చేస్తాడు. అయితే ఇదే క్రమంలో ఆ పాముకు కోపాని గురై వ్యక్తిని కాటేసే ప్రయత్నం చేస్తుంది. ఇలా జరిగినప్పటికీ ఆ వ్యక్తి పామును అస్సలు వదిలి పెట్టడు. మళ్లీ ఆ పాము వ్యక్తి పొట్ట భాగంపై కరిచే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటీకి ఆయన వదిలిపెట్టలేదు. దీంతో చివరి ఏం జరిగిందో విషయం తెలియాల్సి ఉంది. ఈ వీడియోను ALL ONE WANTS అనే యుట్యూబ్ చానెల్ నుంచి షేర్ చేశారు. ఈ సన్నివేశాలు చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్య పోతున్నారు.
Also Read: Post Office Scheme: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి.. భారీ లాభం పొందండి
Also Read: Prince OTT: 'ప్రిన్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి