Best Immune System Booster Drinks: శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తగినంత రోగ నిరోధక శక్తి చాలా అవసరం. రోగనిరోధక శక్తి శరీరంలో కోరతగా ఉంటే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చలికాలంలోనైతే జలుబు జ్వరం గొంతు నొప్పి ఇతర సమస్యల బారిన పడతారు. కాబట్టి శరీరానికి రోగనిరోధక శక్తి చాలా అవసరం. శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా హెర్బల్ టీ లను తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుందని శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అయితే ఎలాంటి టీ లను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
లెమన్ గ్రాస్ టీ:
లెమన్ గ్రాస్ టీ ని ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా శరీర రోగ నిరోధక శక్తి పెరిగి శరీరం దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా సీజనల్ లో వచ్చే వ్యాధుల నుంచి సులభంగా రక్షిస్తుంది. ఇందులో ఉండే గుణాలు జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
ఈ హెర్బల్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఈ టీని ప్రతిరోజు తాగితే.. శరీర బరువు తగ్గడమే కాకుండా జీర్ణ వ్యవస్థ బలంగా తయారవుతుంది. ముఖ్యంగా నోటి సమస్యలు కూడా దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు రెండుసార్లు ఈ లెమన్ గ్రాస్ టీ ని తాగాల్సి ఉంటుంది.
ఈ లెమన్ గ్రాస్ టీని ఎలా తయారు చేసుకోవాలి:
లెమన్ గ్రాస్త్రిని తయారు చేసుకోవడానికి కొంత లెమన్ గ్రాస్ ని తీసుకుని రెండు కప్పుల నీటిలో వేయాలి. ఆ తర్వాత అందులో ఓ చెంచా నిమ్మరసం తేనె అల్లం వేసి బాగా మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత ఓ గ్లాసులో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న టీ ని ప్రతిరోజు రెండు పూటలు తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేయకపోతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
Also Read: Super Star Krishna Death : కృష్ణ మరణం.. పీఎం, సీఎంల సంతాపం.. అంత్యక్రియలు ఎప్పుడంటే?
Also Read: Pawan Kalyan Fans: పవన్ ను చూసి రెచ్చిపోయిన అభిమానులు.. ఇదేం బుద్ది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook