ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో సన్నివేశాలు, డైలాగ్ లు అన్నీ అత్యంత సహజంగా ఉంటాయంటున్నాడు రామ్. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ ఎలిమెంట్ ను ఫీల్ అవుతారని, తమ సినిమా ప్రతి హృదయాన్ని తాకుతుందని గట్టిగా చెబుతున్నాడు. హైదారబాద్ లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన ఎనర్జిటిక్ స్టార్, సినిమాకు వర్క్ చేసిన నలుగురు గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు.
సినిమాకు లిరిక్స్ రాసిన చంద్రబోస్, శ్రీమణినికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాడు రామ్. వాట్ అమ్మ సాంగ్ కు లిరిక్స్ అందించిన శ్రీమణితో పాటు మిగతా పాటలకు సాహిత్యం ఇచ్చిన చంద్రబోస్ కు థ్యాంక్స్ చెప్పాడు. వీళ్లతోపాటు వైజాగ్ లొకేషన్లను కొత్తగా చూపించిన సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరక్టర్ కు థ్యాంక్స్ చెప్పాడు.తన ప్రసంగంలో ఎడిటర్ శ్రీకర ప్రసాద్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పిన రామ్.. సినిమాలో పాటలన్నీ హిట్ అవ్వడంతో సగం టెన్షన్ తగ్గిపోయిందంటున్నాడు. ట్రయిలర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు ఎనర్జిటిక్ స్టార్.