Control Diabetes with Olive Oil: మీకు తెలుసా ? ఆలివ్ పండ్లతో మధుమేహం పూర్తిగా తగ్గించొచ్చని..

Olive Oil For Diabetes: చాలామంది ప్రస్తుతం మధుమేహం వ్యాధి బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ కింద పేర్కొన్న చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. ఈ చిట్కాలతో అన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందచ్చని నిపుణులు సూచిస్తున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2022, 03:33 PM IST
Control Diabetes with Olive Oil: మీకు తెలుసా ?  ఆలివ్ పండ్లతో మధుమేహం పూర్తిగా తగ్గించొచ్చని..

Olive Oil For Diabetes: డయాబెటిస్ అనేది తీరమైన క్లిష్టమైన వ్యాధి. ఒక్కసారి మధుమేహం బారిన పడితే అది దీర్ఘకాలిక వ్యాధులను పెంచుతూనే ఉంటుంది. కాబట్టి ఈ సమస్య నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి ముఖ్యంగా రక్తంలోని చక్కెర పరిమాణాల పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. చక్కెర పరిమాణాలను నియంత్రించేందుకు తక్కువగా చక్కర పరిమాణాలు కలిగిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.

అంతేకాకుండా ఫైబర్ తో కూడిన ఆహారాలను తీసుకోవడం వల్ల సులభంగా రక్తం లోని చక్కర పరిమాణాలను నియంత్రించవచ్చును ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా మధుమేహం వ్యాధిగ్రస్తులు తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలను తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది.

డయాబెటిస్ పేషెంట్లు రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించుకునేందుకు ఎక్కువగా పోషకాలు కలిగిన పండ్లను తినాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఔషధ గుణాలు కలిగిన ఆలివ్ పండ్లను కూడా ఆహారంలో వినియోగించాల్సి ఉంటుంది. ఈ ఆలివ్ ని సూపర్ ఫుడ్ గా కూడా భావిస్తారు. ఇది చూడడానికి చాలా చిన్నదిగా ఉన్నా ఇందులో ఉండే ఔషధ గుణాలు రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్ ఈ యాక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

ఈ పండ్లు ఎక్కడ లభిస్తాయి..?
మధ్యధర దేశాల్లో వీటి వినియోగం ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆలివ్ ని ఎక్కువగా భారతదేశం కంటే ఇతర దేశాలే పండిస్తాయి. భారత్ ఎక్కువగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది.

ఈ పండ్లను ఎలా తినాలి..?
ఆలివ్ లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ గా వినియోగిస్తే అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు ఆలివ్ ఆయిల్ ని ఆహారంలో అధికమవుతాదిలో వినియోగిస్తే రక్తంలోని చక్కర పరిమాణాలు సులభంగా తగ్గుతాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నారు తప్పకుండా వీటితో తయారు చేసిన నూనె వినియోగించాలి.

Also Read: Super Star Krishna Death : కృష్ణ మరణం.. పీఎం, సీఎంల సంతాపం.. అంత్యక్రియలు ఎప్పుడంటే?

Also Read: Pawan Kalyan Fans: పవన్ ను చూసి రెచ్చిపోయిన అభిమానులు.. ఇదేం బుద్ది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News