Bigg Boss Shiva Jyothi : మామిడి తోటలో మజా.. చుక్క, ముక్క.. కల్లు తాగుతున్న బిగ్ బాస్ శివ జ్యోతి

బిగ్ బాస్ ఇంట్లో శివ జ్యోతి చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. ఆమె ఏడుపులకు జనాలకు భయపడిపోయారు. ఎలిమినేట్ అయి కంటెస్టెంట్లు బయటకు వెళ్తుంటే.. మనిషి చనిపోయినట్టుగా ఏడుపులు పెడబొబ్బులతో శివ జ్యోతి అందరినీ భయపెట్టేసింది. శివ జ్యోతికి చివరకు పాతాళగంగా అనే పేరుకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మొదటి సీజన్లో మధుప్రియ, రెండో సీజన్‌కు దీప్తి సునయన, మూడో సీజన్‌కు శివ జ్యోతి అన్నట్టుగా ఏడ్పుకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2022, 11:38 AM IST
  • నెట్టింట్లో బిగ్ బాస్ సావిత్రి సందడి
  • చుక్క ముక్క అంటోన్న శివ జ్యోతి
  • మామిడితోటలో బిగ్ బాస్ కంటెస్టెంట్ పార్టీ
Bigg Boss Shiva Jyothi : మామిడి తోటలో మజా.. చుక్క, ముక్క.. కల్లు తాగుతున్న బిగ్ బాస్ శివ జ్యోతి

Bigg Boss Shivajyothi Party : బిగ్ బాస్ ఇంట్లో శివ జ్యోతి చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. ఆమె ఏడుపులకు జనాలకు భయపడిపోయారు. ఎలిమినేట్ అయి కంటెస్టెంట్లు బయటకు వెళ్తుంటే.. మనిషి చనిపోయినట్టుగా ఏడుపులు పెడబొబ్బులతో శివ జ్యోతి అందరినీ భయపెట్టేసింది. శివ జ్యోతికి చివరకు పాతాళగంగా అనే పేరుకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మొదటి సీజన్లో మధుప్రియ, రెండో సీజన్‌కు దీప్తి సునయన, మూడో సీజన్‌కు శివ జ్యోతి అన్నట్టుగా ఏడ్పుకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు.

బయటకు వచ్చిన శివ జ్యోతి మళ్లీ తనకు అలవాటైన వార్తలను చెప్పుకుంటూ ఉంటోంది. బుల్లితెర కామెడీని పంచేందుకు ట్రై చేస్తోంది. తన భర్తతో కలిసి శివ జ్యోతి బుల్లితెరపై చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇస్మార్ట్ జోడి షోలో శివ జ్యోతి తన భర్త గంగూలితో కలిసి సందడి చేసింది. ఇలా బుల్లితెరపై జోడిలకు పెట్టే అన్ని షోల్లో శివ జ్యోతి కనిపించింది. ఇప్పుడు మిస్టర్ అండ్ మిసెస్ షోలోనూ సందడి చేస్తోంది ఈ జంట.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shiva Jyothi (@iam.savithri)

శివ జ్యోతి తన యూట్యూబ్ వీడియోలతోనూ తెగ వైరల్ అవుతుంటాయి. యూట్యూబ్ ఆదాయం మీద బాగానే ఫోకస్ పెట్టేసినట్టు అనిపిస్తోంది. తాజాగా శివ జ్యోతి తన ఊరికి వెళ్లినట్టుంది. ఇలా తన కుటుంబ సభ్యులతో కలిసి ఫుల్ చిల్ అవుతోన్నట్టుగా కనిపిస్తోంది. ముక్క, చుక్క అంటూ ఫుల్ చిల్ అయినట్టు చెప్పుకొచ్చింది. మా ఊరు మామిడి తోట మటన్ కూర మక్క గుడాలు ఈత కల్లు అంటూ శివ జ్యోతి ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోను చూసి జనాలు షాక్ అవుతున్నారు. జ్యోతక్క కల్లు తాగుతోంది అంటూ నోరెళ్లబెట్టేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read : Super Star Krishna Death : కృష్ణ మరణం.. నాడు నేడు.. మహేష్‌, చైతూ, ఎన్టీఆర్ పిక్ వైరల్

Also Read : Samantha Yashoda overseas Collections : సమంత స్టామినా ఇదే.. అక్కినేని వారు అందుకోలేనంత ఎత్తులో

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News