నిత్య జీవితంలో కొన్ని అలవాట్లు, పద్ధతులు సర్వసాధారణమే అయినా..ఇతరులకు తీవ్ర అసౌకర్యం, ఇబ్బందికి గురిచేస్తుంటాయి. ఇందులో ప్రధానమైంది గురక. ఈ సమస్య నుంచి ఎలా విముక్తి పొందాలో తెలుసుకుందాం..
చాలామందికి గురక సమస్య ఉంటుంది. రాత్రంతా నిద్రలో గట్టిగా గురకపెడుతూ నిద్రపోతుంటారు. ఈ అలవాటు ఇతరులకు ముఖ్యంగా జీవిత భాగస్వామికి అసౌకర్యం కల్గిస్తుంది. ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గురక మరీ తీవ్రంగా ఉండి..వేరే గదుల్లో ఉండేవారి నిద్రను కూడా చెడగొడుతుంటుంది. ఈ గురక సమస్య నుంచి ఎలా విముక్తి పొందాలనేది ఇప్పుడు పరిశీలిద్దాం. గురక సమస్య నుంచి విముక్తి పొందేందుకు మార్గాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
గురక ఎందుకొస్తుంది
గాఢ నిద్రలో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం, వదిలే సమయంలో మెడకు చెందిన మృదువైన టిష్యూ కంపిస్తుంది. ఫలితంగా గురక వస్తుంది. ఈ మృదువైన టిష్యూ మన ముక్కులో టాన్సిల్, నోటిలో పైభాగంలో ఉంటుంది. నిద్రలో శ్వాస తీసుకోవడం, వదిలే సమయంలో బలం ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ సమయంలో టిష్యూలో విచిత్రమైన వైబ్రేషన్ ఉంటుంది. ఫలితంగా గురక తప్పదు.
గురకను నియంత్రించే పద్ధతులు
ముక్కును శుభ్రం చేయడం
ముక్కులో సహజంగా వ్యర్ధాలు పేరుకుపోతుంటాయి. దీనివల్ల కూడా గురక వస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఉంటుంది. అందుకే ముక్కును సాధ్యమైనంతవరకూ శుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నించాలి.
బరువు తగ్గించడం
సాధారణంగా లావుగా ఉన్నవాళ్లకు గురకు సమస్య అధికంగా ఉంటుంది. సన్నగా ఉండేవాళ్లలో ఈ సమస్య ఉంటుంది కానీ తక్కువ. అందుకే గురక సమస్య నుంచి విముక్తి పొందాలంటే ముందు బరువు తగ్గించాలి. దీనికోసం హెల్తీ డైట్ తీసుకోవడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం.
స్లీపింగ్ పొజిషన్ ఎలా ఉండాలి
సాధారణంగా వీపు ఆన్చి పడుకునేవారిలో గురక సమస్య అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో గురక రాకుండా ఉండాలంటే..స్లీపింగ్ పొజిషన్ మార్చాలి. ఓ పక్కకు తిరిగి పడుకోవడం మంచి అలవాటు.
Also read: Green Apple Benefits: గ్రీన్ ఆపిల్ రోజూ తింటే..లివర్, లంగ్స్ సమస్యలు దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook