సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నేడు సీబీఎస్ఈ నీట్ యూజీ పరీక్ష ఫలితాలు నేడు ప్రకటించనుంది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్- cbseneet.nic.inలో పరీక్ష రాసిన విద్యార్థులు తమ ఫలితాలు చూసుకోవాలని తెలిపింది. గతంలో, ఫలితాలను జూన్ 6 న ప్రకటించాలని భావిస్తున్నట్లు చెప్పిన పాఠశాల విద్య కార్యదర్శి, అనిల్ స్వరూప్.. నేడు సీబీఎస్ఈ నీట్ ఫలితాలను ప్రకటిస్తున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించారు.
CBSE informs that NEET results would be declared today.
— Anil Swarup (@swarup58) June 4, 2018
నీట్ యూజీ (NEET UG) పరీక్ష ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల్లో ప్రవేశించడానికి నిర్వహించబడుతుంది. ఎయిమ్స్(AIIMS), జిప్ మర్ (JIPMER) కాకుండా అన్ని వైద్య, దంత విద్యా సంస్థల్లో చేరడానికి ఈ స్కోరు అవకాశం కల్పిస్తుంది.
మే 6, 2018న నిర్వహించిన సీబీఎస్ఈ నీట్ యూజీ పరీక్షను 2255 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించగా.. దాదాపు 13 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. నీట్ 2018 పరీక్ష ఆన్సర్ 'కీ'ని మే 25న విడుదల చేయగా.. మే 27 వరకు అభ్యర్థనలను స్వీకరించారు.