మీకు వచ్చేవారం బ్యాంకు పనులుంటే ముందే సిద్ధమైపోండి. ఎందుకంటే వచ్చేవారం బ్యాంకు సమ్మె ఉంది. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు స్ట్రైక్‌లో పాల్గొననున్నాయి. ఈ వివరాలు మీ కోసం..
వచ్చేవారం అంటే నవంబర్ 19వ తేదీన బ్యాంకు సిబ్బంది సమ్మెకు దిగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు సమ్మెలో పాల్గొంటున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్ ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చింది. బ్యాంక్ ఆప్ బరోడా స్టాక్ ఎక్స్చేంజ్‌కు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సమాచారం అందించింది. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నోటీసు జారీ చేసింది. బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ తమ డిమాండ్ల సాధనకై నవంబర్ 19వ తేదీన సమ్మెకు దిగనుందని నోటీసులో ఉంది.
సమ్మెరోజున అంటే నవంబర్ 19వ తేదీన బ్యాంకు శాఖలు, ఆఫీసుల్లో ఆపరేషన్స్ కొనసాగించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. అయితే బ్యాంకు సిబ్బంది సమ్మెలో పాల్గొంటే..బ్యాంకు పనితీరుపై ప్రభావం పడనుంది. నవంబర్ 19వ తేదీన శనివారం కాగా రెండవ శనివారం సెలవు ఉంటుంది. అంటే వరుసగా రెండు శనివారాలు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి
ఈ క్రమంలో శనివారం నాడు సమ్మె కారణంగా పనులన్నీ నిలిచిపోనున్నాయి నవంబర్ 20వ తేదీన ఆదివారం సెలవుంది. అంటే వరుసగా రెండ్రోజులు బ్యాంకింగ్ సేవలు ఆగిపోతున్నాయి. అటు ఏటీఎం సేవలు కూడా ఆ రెండ్రోజులు నిలిచిపోనున్నాయి.
Also read: 7th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్, పెరగనున్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook