ICC T20I rankings 2022: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) అదరగొట్టాడు. భీకర ఫామ్ లో ఉన్న అతడు టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. పాకిస్థాన్ ఓపెనర్ రిజ్వాన్ ను వెనక్కినెట్టి 863 పాయింట్లతో నంబర్ 1 ర్యాంక్ సాధించాడు సూర్య.
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో సూర్య అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు అర్థ సెంచరీలు సాధించాడు. రీసెంట్ గా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఓ పక్క వికెట్లు పడుతున్న మరో వైపు సూర్య తనదైన శైలిలో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి కేవలం 40 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతోనే అతడు ఐసీసీ ర్యాంకింగ్స్ లో తొలి స్థానానికి దూసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ అగ్రపీఠాన్ని అధిరోహించిన 23వ క్రికెటర్ గా నిలిచాడు. గతంలో టీమిండియా తరపున విరాట్ కోహ్లీ మాత్రమే అగ్రస్థానం సాధించాడు. దీంతో ఈ ఘనత అందుకున్న రెండో క్రికెటర్ గా సూర్య నిలిచాడు. ఈ ఏడాది టీ20ల్లో ఇప్పటి వరకు ఒక సెంచరీతో సహా 935 పరుగుల చేశాడు సూర్య.
న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే 792 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. కివీస్ కు చెందిన గ్లెన్ ఫిలిప్స్ శ్రీలంకపై 104, ఇంగ్లండ్‌పై 62 పరుగులు చేసి కెరీర్‌లో అత్యుత్తమ ఏడో స్థానానికి చేరుకోగా, బంగ్లాదేశ్‌పై 109 పరుగులు చేసిన దక్షిణాఫ్రికాకు చెందిన రిలీ రోసౌ టాప్ 10లోకి ప్రవేశించాడు. అతను 17 స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానంలో నిలిచాడు. బౌలర్లలో రషీద్ ఖాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో హసరంగా కొనసాగుతున్నాడు. ఇద్దరికీ మూడు పాయింట్లు మాత్రమే తేడా ఉంది.
Also Read: Rohit Shamra: ఆ సమయంలో భయపడిన రోహిత్ శర్మ..? ఈ ముగ్గురు ప్లేయర్స్ మ్యాచ్ విన్నర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook
ICC T20I rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నెం.1గా సూర్యకుమార్ యాదవ్