Belly Fat Loss Exercises: వేలాడుతున్న పొట్టకు కూడా ఇలా 15 రోజుల్లో సులువుగా చెక్‌ పెట్టొచ్చొ.. ఎలాగో తెలుసా..?

Belly Fat Loss Exercises: ప్రస్తుతం చాలా మంది బరువు పెరుగుతున్నారు. అయితే ఇలా పెరుగుతున్న శరీర బరువు నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కుర్చిలో కూర్చొని వ్యాయామాలు చేయోచ్చు. అయితే ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2022, 04:47 PM IST
  • కుర్చీలో కూర్చుని వ్యాయామాలు చేస్తే
  • కేవలం 15 రోజుల్లో సులభంగా ..
  • బెల్లీ ఫ్యాట్‌, బరువును తగ్గించుకోవచ్చు.
Belly Fat Loss Exercises: వేలాడుతున్న పొట్టకు కూడా ఇలా 15 రోజుల్లో సులువుగా చెక్‌ పెట్టొచ్చొ.. ఎలాగో తెలుసా..?

weight loss exercises at home: ప్రస్తుతం అందరూ బిజీ లైఫ్‌ను అనుభవిస్తున్నారు. దీంతో వీరు బరువు పెరగడం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే చాలా మంది ఆధునిక జీవన శైలి కారణంగా టైమ్‌ లేకపోవడం వల్ల అనారోగ్యకరమైన ఆహారాలను విచ్చలవిడిగా తీసుకుంటున్నారు. అయితే దీని వల్లే  బెల్లీ ఫ్యాట్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సులభంగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఇలా వ్యాయామాలు చేయడం వల్ల సుభంగా బరువు తగ్గుతారని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎలాంటి వ్యాయామాలు చేస్తే సులభంగా బెల్లీఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందా..

కుర్చీలో కూర్చుని కూడా బెల్లీ ఫ్యాట్‌కు చెక్‌:
బరువు తగ్గించుకోవడానికి ఇంట్లో ఉండే కూర్చుని ఉపయోగించి కూడా వ్యాయామాలు చేయోచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ప్రతి రోజు ఉదయం పూట నిద్ర లేచిన తర్వాత వ్యాయామాలు చేయడం వల్ల సులభంగా బెల్లీఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

బొడ్డు చుట్టు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి.. కుర్చీపై కూర్చుని, రెండు చేతులతో హ్యాండిల్ను పట్టుకుని ఆ కుర్చిని కూర్చొని పైనకు లేపండి. ఇలా 20 నుంచి 25 సార్లు లేపితే సులభంగా వేలాడుతున్న పొట్టకు చెక్‌ పెట్టొని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

శరీర బరువు ఎక్కువగా ఉన్నవారు కేవలం 10 సార్లు మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా బరువు తగ్గడంతో పాటు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వ్యాయమంతో పాటు వాకింగ్‌ కూడా చేయాలి:
 ప్రతి రోజూ ఇలా వ్యామాయాలు చేయడమేకాకుండా వాకింగ్‌ కూడా చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజూ వాకింగ్‌ చేయడం వల్ల సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యాయామం చేసే క్రమంలో తప్పకుండా పోషకాలున్న ఆహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read : Chiranjeevi-Garikapati : మళ్లీ వివాదం షురూ.. గరికపాటి మీద చిరంజీవి పరోక్ష సెటైర్లు.. వీడియో వైరల్

Also Read : Jagadish Reddy: మంత్రి జగదీశ్ రెడ్డికి ఈసీ ఝలక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News