ఆధునిక జీవనశైలి కారణంగా తలెత్తే అతి ప్రధాన సమస్య కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ నియంత్రణ పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు 5 సులభమైన పద్ధతులున్నాయి. అవేంటో చూద్దాం..
కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. కొలెస్ట్రాల్ అంటే రక్తంలో పేరుకుపోయే ఆయిలీ పదార్ధం. ఇది ఆరోగ్యానికి మంచిది కానే కాదు. ఆరోగ్యవంతమైన శరీరంలో ఎల్‌డీఎల్ 100 కంటే తక్కువగా ఉండాలి. ఇది 130 దాటితే గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుంది. మరి కొలెస్ట్రాల్ శరీరంలో ఎలా తగ్గించాలి.
కొలెస్ట్రాల్ సులభంగా తగ్గించేందుకు 5 పద్ధతులున్నాయి. ఇందులో ముఖ్యమైంది వ్యాయామం. రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. రెండవది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలు వంటి ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి.
యాపిల్ వంటి ఫైబర్ అధికంగా పదార్ధాలు తీసుకోవాలి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ అవశేషాల్ని తగ్గిస్తాయి. దీంతోపాటు నట్స్, సీడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో ఉండే పోలీ అన్‌శాచ్యురేటెడ్ ఇందుకు ఉపయోగపడుతుంది.
మద్యపానానికి దూరంగా ఉండాలి. మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే అవకాశముంది.
Also read: Cucumber Benefits: మీ బ్లడ్ షుగర్ లెవెల్ నియంత్రణకు ఆ ఒక్కటీ చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Cholesterol Tips: 3 వారాల్లో కొలెస్ట్రాల్ తగ్గించే 5 సులభమైన పద్ధతులు ఇవే