WhatsApp Back: బీ రిలాక్స్.. వాట్సాప్ ఈజ్ బ్యాక్

Whatsapp Woriking: దాదాపు రెండు గంటల బంద్ తరువాత వాట్సాప్ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. సేవలకు అంతరాయం కలగడంతో యూజర్లు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 25, 2022, 02:53 PM IST
  • ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సర్వర్ డౌన్
  • రెండు గంటలపాటు యూజర్లు ఇబ్బంది
  • తిరిగి ప్రారంభమైన సేవలు
WhatsApp Back: బీ రిలాక్స్.. వాట్సాప్ ఈజ్ బ్యాక్

Whatsapp Woriking: వాట్సాప్ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. దాదాపు రెండు గంటల పాటు నిలిచిపోవడం వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మెసెజ్‌లు పంపించిన తరువాత అలానే ఆగిపోయాయి. దీంతో నెట్ వర్క్ ప్రాబ్లమ్ ఉందేమోనని చెక్ చేసుకుంటున్నారు. నెట్ వర్క్ మార్చి చెక్ చేస్తున్నా మెసెజ్‌లు సెండ్ అవ్వడం అవ్వలేదు. వేలాది మంది వినియోగదారులకు వాట్సాప్ పని చేయడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా అరగంట నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోవడంతో యూజర్లు తికమక పడ్డారు. దాదాపు రెండు గంటలపాటు నిలిచిపోయిన సేవలు.. మధ్యాహ్నం  2.15 గంటలకు తిరిగి ప్రారంభమయ్యాయి. 

సర్వర్ డౌన్ కారణంగా వాట్సాప్ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.  వ్యక్తిగతంగా మెసెజ్‌లు పంపిస్తున్న సమయంలో సింగిల్ టిక్ మాత్రమే వచ్చింది. దీంతో జరుగుతుందో తెలియక యూజర్లు అయోమయానికి గురయ్యారు.

మంగళవారం మధ్యాహ్నం 12.30 నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోయాయని సోషల్ మీడియాలో యూజర్లు కామెంట్స్ చేశారు. ట్విట్టర్‌లో #whatsappdown హ్యాష్‌ట్యాగ్‌ను నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు ఫన్నీ మీమ్స్ సైతం వైరల్ అవుతున్నాయి.

 

 

Also Read: Petrol Pump Scams: పెట్రోల్ బంకుల్లో మోసాలకు చెక్ పెట్టండి.. ఇలా చేస్తే మీ డబ్బులు ఆదా..!  

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లి సలహాను పాటించని అశ్విన్‌.. చాలా తెలివిగా పాకిస్థాన్‌కు చెక్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News