Diwali 2022 Date: దీపావళి రోజు రాత్రి ఈ శంఖాన్ని పూజించండి..పేదవాడు కూడా ధనవంతుడవుతాడు..

Diwali 2022 Date: దీపావళి రోజున లక్ష్మీదేవిని, గణేశుడిని పూజించాలని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఈసారి దీపావళి అక్టోబర్ 24న వస్తోంది. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన శంఖాన్ని పూజించడం వల్ల సుఖ శాంతులు లభిస్తాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2022, 09:46 AM IST
  • దీపావళి రోజు రాత్రి క్షిణవర్తి శంఖాన్ని
  • పూజించండం వల్ల అన్ని రకాల..
  • పేదవాడు కూడా ధనవంతుడవుతాడు..
Diwali 2022 Date: దీపావళి రోజు రాత్రి ఈ శంఖాన్ని పూజించండి..పేదవాడు కూడా ధనవంతుడవుతాడు..

Lakshmi Pujan Vidhi Diwali 2022: హిందువులందరికీ అతి ప్రముఖ్యత కలిగిన పండగల్లో దీపావళి పండగ ఒకటి. ప్రతి సంవత్సరం దీపావళి పండుగ కార్తీక మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం దీపావళిని అక్టోబర్ 24న జరగబోతోంది. అయితే హిందూ గ్రంథాల ప్రకారం దీపావళి రోజున లక్ష్మిదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే లక్ష్మీ దేవితో పాటు వినాయకున్ని పూజించడం వల్ల సంపదలకు కోరతే ఉండదని శాస్త్రం పేర్కొంది. లక్ష్మదేవి అనుగ్రహం లభించాలంటే తప్పకుండా భక్తి శ్రద్ధలతో దేవిని పూజించాల్సి ఉంటుంది. అయితే పూజా క్రమంలో తప్పకుండా పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అమ్మవారికి స్వీట్‌తో కూడిన నైవేద్యాలు సమర్పించాల్సి ఉంటుంది.

లక్ష్మీపూజలో శంఖాన్ని చేర్చండి:
లక్ష్మీదేవికి దక్షిణవర్తి శంఖం చాలా ప్రీతికరమైనది.  శంఖం సక్ష్యత్తు సముద్రంలో నివసించే దేవతల నుంచి వచ్చిందని నమ్ముతారు. అయితే దీపావళి సందర్భంగా అమ్మవారు శంఖాన్ని ధరిస్తారని శాస్త్రంలో పేర్కొన్నారు. కాబట్టి ఈ శంఖాన్ని దీపావళి రోజున పూజించడం వల్ల అన్ని రకాల సమస్యలు దూరమయ్యి. ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి.

దీపావళి రోజున దక్షిణవర్తి శంఖం పరిహారాల:
>>దీపావళి రోజున దక్షిణవర్తి శంఖాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని జోతిష్య శాస్త్రం పేర్కొంది.
>>ఈ శంఖాన్ని ఇంట్లో దక్షిణ దిక్కున ఉంచడం వల్ల డబ్బుకు కోరత ఉండదని శాస్త్రం చెబుతోంది.
>>రాత్రిపూట లక్ష్మీదేవిని పూజించే సమయంలో దక్షిణవర్తి శంఖంలో గంగాజలం నింపి పూజలో ఉంచాలి.
>>పూజ తర్వాత..'ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయై నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
>>లక్ష్మిని పూజించిన తర్వాత శంఖాన్ని ఎర్రటి గుడ్డలో చుట్టి భద్రంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల డబ్బు సమస్యలకు కోరత ఉండదు.

దక్షిణవర్తి శంఖం ప్రయోజనాలు:
>>శంఖాన్ని దక్షిణాన ఉండడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి రావు.
>>శత్రువుల నుంచి మీకు హాని  
>> ఇంట్లో లక్ష్మి దేవి స్థిర నివాసం ఉంటుంది.
>>ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి లభిస్తుంది.
>>శంఖం శబ్ధం వల్ల ప్రతికూల శక్తి నశిస్తుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

 

Also Read: TSPSC Group-1: ప్రశాంతంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌... సివిల్స్ స్థాయిలో ప్రశ్నలు..!

Also Read: TSPSC Group-1: ప్రశాంతంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌... సివిల్స్ స్థాయిలో ప్రశ్నలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link https://bit.ly/3P3R74U 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News