దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును జస్టిస్ యుయు లలిత్ సిఫారసు చేశారు. జస్టిస్ ఎన్ వి రమణ తరువాత సీజేఐగా స్వల్పకాలానికి నియమితులైన జస్టిస్ యుయు లలిత్ నవంబర్ 8వ తేదీన రిటైర్ కానున్నారు.
ఇక నవంబర్ 9వ తేదీన జస్టిస్ డీవై చంద్రచూడ్ కొత్త సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ లలిత్ కేవలం 74 రోజులపాటే ప్రధాన న్యాయమూర్తిగా ఉంటుండగా, జస్టిస్ చంద్రచూడ్ మాత్రం రెండేళ్ల వరకూ సుదీర్ఘకాలం వ్యవహరించనున్నారు. జస్టిస్ చంద్రచూడ్ నవంబర్ 10, 2024 వరకూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారు.
జస్టిస్ చంద్రచూడ్ నేపధ్యం
జస్టిస్ చంద్రచూడ్ 2016 మే 13వ తేదీన సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు కంటే ముందు అక్టోబర్ 31, 2013 నుంచి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. అంతకముందు అంటే మార్చ్ 2000 నుంచి అక్టోబర్ 2013 వరకూ బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 1998-2000 వరకూ అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. ఆధార్ చట్టాన్ని మనీ బిల్లుగా ఆమోదించడం, కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని అనుమతించడం వంటి కీలక తీర్పులిచ్చారు.
విశేషమేంటంటే జస్టిస్ చంద్రచూడ్ తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం సేవలందించారు. సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్‌గా 1978 నుంచి 1985 వరకూ సుప్రీంకోర్టు చరిత్రలోనే ఎక్కువకాలం సీజేఐగా పనిచేసింది ఈయనొక్కరే. ఆయన సుప్రీంకోర్టు 16వ న్యాయమూర్తిగా పనిచేశారు. ఇప్పుడాయన కుమారుడు జస్టిస్ డీవై చంద్రచూడ్ రెండేళ్లపాటు సీజేఐగా వ్యవహరించనున్నారు. ఇటీవలి కాలంలో ఇదే ఎక్కువ.
Also read: Sitrang Cyclone: 'సిత్రాంగ్' వచ్చేస్తుంది.. మరికొన్ని రోజులు భారీ వర్షాలు తప్పవు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook