T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ ఆ సెంటిమెంట్ ఎవరికి కలిసొస్తుంది, కీలకమైన విషయాలు

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022 ప్రారంభమైపోయింది. టీమ్ ఇండియా తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తో అక్టోబర్ 23న ఆడనుంది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు, రికార్డుల గురించి తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 17, 2022, 04:58 PM IST
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ ఆ సెంటిమెంట్ ఎవరికి కలిసొస్తుంది, కీలకమైన విషయాలు

ఆస్ట్రేలియా వేదికగా క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూసిన టీ20 ప్రపంచకప్ 2022 ప్రారంభమైపోయింది. టీమ్ ఇండియా తొలిసారిగా 2007లో కప్ గెల్చుకుంది. టీ20 ప్రపంచకప్ గురించి మరిన్ని వివరాలు పరిశీలిద్దాం.

టీ20 ప్రపంచకప్‌ను తొలిసారిగా టీమ్ ఇండియా 2007లో గెల్చుకుంది. ఇప్పటి వరకూ జరిగిన 7 సీజన్లలో వెస్ట్ ఇండీస్ రెండుసార్లు టీ20 ప్రపంచకప్ దక్కించుకుంది. అక్టోబర్ 23న టీమ్ ఇండియా తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తో ఆడనుంది. వెస్టిండీస్ కాకుండా ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లండ్, శ్రీలంక, ఆస్ట్రేలియాలు ఒక్కొక్కసారి కప్ గెల్చుకున్నాయి. 

టీ20 ప్రపంచకప్ గురించి ఆసక్తికర విషయాలు

1. మహేంద్రసింగ్ ధోని వికెట్ కీపర్‌గా అత్యధికంగా 32 మందిని స్టంప్ అవుట్ చేసిన రికార్డు ఉంది. 

2. వెస్ట్ ఇండీస్ టీమ్ ఒక్కటే టీ20 ప్రపంచకప్‌ను రెండుసార్లు గెల్చుకుంది. 

3. ఏబీ డివిలియర్స్ అత్యధికంగా 23 క్యాచ్‌లు పట్టిన రికార్డు సాధించాడు.

4. టీ20 ప్రపంచకప్‌లో ఒక్క క్రిస్ గేల్ మాత్రమే రెండు సెంచరీలు సాధించాడు. 2007లో దక్షిణాఫ్రికాపై, 2016లో ఇంగ్లండ్‌పై ఈ రికార్డు సాధించాడు.

5. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇండియా తరపున అత్యధికంగా 26 వికెట్లు పడగొట్టాడు.

6. ఇప్పటి వరకూ ఏ ఆతిధ్య దేశం కూడా టీ20 ప్రపంచకప్ గెల్చుకోలేదు. సిట్టింగ్ ఛాంపియన్ కూడా కప్ సాధించలేదు.

7. ఆస్ట్రేలియాను 2007లో తొలిమ్యాచ్‌లో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో ఓడించింది.

8.  శ్రీలంక జట్టుదే అత్యధిక స్కోరుగా ఉంది. 2007లో 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది.

9. మహేల జయవర్ధనే టీ20 ప్రపంచకప్‌‌లో అత్యధికంగా 1016 పరుగులు సాధించాడు.

10. టీ20 ప్రపంచకప్‌లో తొలి హ్యాట్రిక్ ఆస్ట్రేలియా బౌలర్ బ్రెట్ లీ 2007లో బంగ్లాదేశ్‌పై సాధించాడు.

11. బంగ్లాదేశ్‌కు చెందిన షాకిబ్ అల్ హసన్ టీ20 ప్రపంచకప్‌లో అత్యధికంగా 41 వికెట్లు తీశాడు.

12. టీ20 ప్రపంచకప్‌లో అత్యల్ప స్కోరు 39 పరుగులు మాత్రమే. నెదర్లాండ్ జట్టు 2014లో శ్రీలంకపై నమోదు చేసిన స్కోర్ ఇది

13. టీ20 ప్రపంచకప్‌‌లో భారత్ పాకిస్తాన్ మద్య ఒకే ఒకసారి బాల్ అవుట్ జరిగింది. ఆ తరువాత ఒక ఓవర్ సూపర్ ఓవర్ ఆడుతున్నారు.

Also read: West Indies vs Scotland: టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం.. హిట్టర్లకు మారుపేరు వెస్టిండీస్‌ను ఓడించిన పసికూన స్కాట్లాండ్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News