Munugode Bypoll: తెలంగాణ రాష్ట్రమే కాదు దేశ వ్యాప్తంగా హాట్ హాట్ గా మారిన మునుగోడు ఉప ఎన్నికలో అన్ని సంచలనాలే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచే నియోజకవర్గంలో రాజకీయం రంజుగా మారింది. ప్రధాన పార్టీలు తాయిలాలు, ప్రలోభాలకు తెరతీశాయి. నేతల వలసల గురించి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. నేతలను కాదు ఓటర్లను గంపగుత్తగా కొనేస్తున్నాయి పార్టీలు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఉద్రిక్తతలు కూజడా తలెత్తుతున్నాయి.
ఓట్ల కొనుగోళ్ల విషయంలోనే తాజాగా మంత్రి మల్లారెడ్డికి చుక్కెదురు అయింది. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి మల్లారెడ్డికి షాక్ తగిలింది. చౌటుప్పల్ మండలం ఆరెగుడెంలో మంత్రి మల్లారెడ్డిని గౌడ కులస్తులు అడ్డుకున్నారు. తమకు ఇస్తామని హామీ ఇచ్చిన 12 లక్షల రూపాయలను వెంటనే ఇవ్వాలని నిలదీశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత తలెత్తింది. గౌడ కులస్తులతో టీఆర్ఎస్ కార్యకర్తలు గొడవకు దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. తర్వాత గౌడ సంఘం నేతలతో మాట్లాడి సమస్యను సెటిల్ చేసుకున్నారు మంత్రి మల్లారెడ్డి.
మునుగోడు ఉపఎన్నికలో చౌటుప్పల్ మండలం ఆరెగూడం టీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ గా ఉన్నారు మల్లారెడ్డి. గత వారం రోజులుగా అక్కడే ప్రచారం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం గౌడ సామాజికవర్గం ఓటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుడి నిర్మాణానికి 12 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా.. ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. 2 లక్షల రూపాయలు వెంటనే ఇచ్చారు. మిగితా 10 లక్షల రూపాయలను ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డిని నిలదీశారు గౌడ సంఘ నాయకులు. ఎన్నికల తర్వాత ఎవరూ అందుబాటులో ఉండరని.. ఇప్పుడు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మునుగోడు ప్రచారంలోనే ఓటర్లకు మందు పార్టీ ఇచ్చారని మంత్రి మల్లారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. పార్టీ నేతలతో కలిసి మల్లారెడ్డి మందు తాగిన ఫోటోలు బయటికి వచ్చాయి. వైరల్ గా మారి దుమారం రేపాయి. అయితే తాను ఓటర్లతో కలిసి మందు తాగలేదని.. తన బంధువులతో కలిసి తాగానని మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. బంధువులు కలిసినప్పుడు మందు పార్టీ చేసుకోవడం తెలంగాణలో కామన్ అన్నారు మల్లారెడ్డి.
Read Also: Munugodu Bypoll: మునుగోడు టు ఏపీ బీజేపీ, కొత్త పొత్తు టీడీపీకు వర్కవుట్ అవుతుందా
Read Also: Pawan Kalyan Vizag Tour Live Updates: విశాఖ విడిచివెళ్లాలని పవన్ కు నోటీసులు.. జనసేనాని ఏం చేస్తారో?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook