Boora Narsaiah Goud: తెలంగాణలో అత్యంత కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీకి షాకిచ్చారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన బూర.. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరబోతున్నారు. బూర రాజీనామా మునుగోడు టీఆర్ఎస్ లో కుదుపుకు కారణమైంది. కొన్ని రోజులుగా జోష్ లో ఉన్న గులాబీ కేడర్ కు ఇది షాకింగ్ లా మారింది. బూరతో పాటు ఎవరెవరు బీజేపీలో చేరుతారనే అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. గతంలో బూరతో సన్నిహితంగా ఉన్న నేతలతో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడి.. ఎవరూ ఆయన వెంట వెళ్లకుండా చూస్తున్నారని తెలుస్తోంది.
ఇక బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరిక వెనుక శాసనమండలి మాజీ చైర్మెన్ స్వామిగౌడ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. బూర విషయంలో బీజేపీ పెద్దలతో మాట్లాడి పార్టీలో ఆయన స్థానం, వచ్చే ఎన్నికలో సీటుపై క్లారిటీ ఇచ్చారని చెబుతున్నారు. బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో బూర నర్సయ్య గౌడ్ అసెంబ్లీకి పోటీ చేస్తారని తెలుస్తోంది. 2014లో భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సంచలన విజయం సాధించిన బూర.. 2019లో మాత్రం వెంకట్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే బూర భువనగిరి ఎంపీగా పోటి చేసినా.. ఆయన సొంతూరు మాత్రం సూర్యాపేట నియోజకవర్గంలో ఉంది. డాక్టర్స్ జేఏసీ చైర్మెన్ గా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన బూర.. సీఎం కేసీఆర్ కు బాగా దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలోనే 2014 ఎన్నికల్లో పోటీకి సిద్దమైన బూర.. సూర్యాపేట అసెంబ్లీ సీటు కావాలనే కేసీఆర్ ను బూర కోరారు. అయితే జగదీశ్ రెడ్డికి సూర్యాపేటలో అవకాశం ఇచ్చి.. బూరను భువనగిరి ఎంపీగా బరిలో దింపారు గులాబా బాస్. అప్పటి నుంచే జగదీశ్ రెడ్డి, బూర మధ్య గ్యాప్ ఉందనే టాక్ కూడా ఉంది.
బీజేపీలో చేరిన బూర నర్సయ్యకు సూర్యాపేట అసెంబ్లీ టికెట్ పై కమలం పార్టీ పెద్దలు స్పష్టమైన హామీ ఇచ్చారని తెలుస్తోంది. సూర్యాపేటలో బీసీ వర్గాలు బలంగా ఉన్నాయి. గతంలో దర్మబిక్షం సూర్యాపేట నుంచి మొదటగా చట్టసబలోకి ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో గౌడ్, యాదవ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బూరకు సూర్యాపేట అసెంబ్లీ టికెట్ ఇచ్చేలా బీజేపీ హైకమాండ్ స్పష్టమైన హామీ ఇచ్చిందని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా రాజకీయాలను గత 9 ఏళ్లుగా శాసిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని భావిస్తున్న బీజేపీ.. ఆయనపై బూరను దింపాలని డిసైడ్ అయిందని తెలుస్తోంది. బూరతో బీసీ వాదంతో జగదీశ్ రెడ్డికి చెక్ పెట్టాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. మొత్తంగా బూర బీజేపీలో చేరితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోతాయని, కమలం పార్టీకి బూస్ట్ రావడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Read also: AP Rain Alert: ఏపీకి సూపర్ సైక్లోన్ ముప్పు.. సిత్రాంగ్ తో వరద విలయం తప్పదా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook