Breakfast For Diabetes: మధుమేహాన్ని నియంత్రించే అద్భుత ఔషధాలు ఇవే.. వీటితో అన్ని సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

Breakfast For Diabetes: ప్రస్తుతం చాలా మంది  మధుమేహం సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీటిని వినియోగించి ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు..  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2022, 05:17 PM IST
  • శెనగపిండితో చేసిన సలాడ్స్, గుడ్లు,
  • మేతి పరాటా ఆహారంలో తీసుకుంటే కేవలం
  • 19 రోజుల్లో మధుమేహాన్ని నియంత్రించవచ్చు.
Breakfast For Diabetes: మధుమేహాన్ని నియంత్రించే అద్భుత ఔషధాలు ఇవే.. వీటితో అన్ని సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

Breakfast For Diabetes: రక్తంలో చక్కెర పరిమాణాలు పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు మధుమేహం ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా రక్తంలో చక్కెర పరిమాణాలను ఎప్పుడు పరీక్షిస్తూ ఉండాలి.  అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను అతిగా తీసుకోవడం వల్ల మధుమేహం పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు రోజూ తీసుకునే ఆహారంలో కేవలం పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. మధుమేహాన్ని నియంత్రించుకోవడానికి తప్పకుండా అల్పాహారంలో భాగంగా ఈ కింద పేర్కొన్న ఆహారాలు తీసుకుంటే మంచిది. అయితే మధుమేహం నియంత్రణలో ఉండడానికి ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

శెనగపిండితో చేసిన సలాడ్స్:
మధుమేహం ఉన్నవారు తాజా కూరగాయలను తీసుకుని శెనగపిండిలో వేసి సలాడ్స్‌లా తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలగడమేకాకుండా మధుమేహం సులభంగా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

గుడ్లు:
గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని అందరూ క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటారు. అయితే మధుమేహంతో బాధపడేవారు ఉడకబెట్టిన గుడ్డును ప్రతి రోజూ తీసుకుంటే శరీరం దృఢంగా తయారు కావడమేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీరు ఆరోగ్యంగా ఉండడానికి ఆమ్లెట్‌లను తయారు చేసుకుని కూడా ఆహారంలో తీసుకోవచ్చు.

మేతి పరాటా:
తాజా మెంతి ఆకులు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ డయాబెటిస్‌ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ పరాటాను ఉదయం పూట టిఫిన్‌లో తీసుకుంటే మధుమేహం సులభంగా నియంత్రణలో ఉంటుంది.

మొలకలు:
మధుమేహంతో బాధపడుతున్నవారు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా తీసుకోవాల్సినవి మొలకలు. ఇందులో ఉండే మూలకాలు రక్తంలో చక్కెర పరిమాణాలను సులభంగా తగ్గిస్తాయి. అంతేకాకుండా వీటిని దోసలా చేసుకుని తీసుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు.

ఓట్స్ ఆమ్లెట్:
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఓట్స్ చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. అయితే మధుమేహంతో బాధపడేవారు ఓట్స్‌ను ఆమ్లెట్‌లా వినియోగిస్తే సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలను తగ్గించుకోవచ్చని నిపుణులు తెలుపతున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: టీ20 ప్రపంచకప్‌లో భువనేశ్వర్‌ రాణించలేడు.. టీమిండియాకు కష్టాలు తప్పవు: వసీం అక్రమ్‌

Also Read: ప్రేమను నిరాకరించిందని.. ట్రైన్ కింద తోసేసి యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News