Bihar Govt Employees will get 4 percent Dearness Allowance hike: దీపావళి 2022కి ముందే బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ కానుక అందింది. నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డీఏ (డియర్నెస్ అలవెన్స్)ను నాలుగు శాతం పెంచింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. తాజా నిర్ణయంతో బీహార్ రాష్ట్రంలో డీఏ 38 శాతంకు చేరింది. అంతకుముందు డీఏ 34 శాతంగా ఉంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 21 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.
డీఏను 4 శాతం పెంచుతున్నట్లు సమావేశం అనంతరం క్యాబినెట్ సెక్రటేరియట్ విభాగం అదనపు ముఖ్య కార్యదర్శి ఎస్. సిద్ధార్థ్ మీడియాకు తెలిపారు. పెంచిన డియర్నెస్ అలవెన్స్ 2022 జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. ఇంతకుముందు జనవరికి డియర్నెస్ అలవెన్స్‌ను ప్రభుత్వం మార్చిలో ప్రకటించింది. అప్పుడు 31 నుంచి 34 శాతానికి డీఏ పెంచారు. తాజా నిర్ణయంతో దీపావళికి బీహార్ రాష్ట్ర ప్రజలకు భారీగా డబ్బు అందనుంది.
కరువు పీడిత ప్రాంతాలకు కంటింజెన్సీ ఫండ్ నుంచి రూ. 500 కోట్లు కేటాయించేందుకు బీహార్ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. దీంతో పాటు రాష్ట్రంలోని 11 జిల్లాల్లోని 96 బ్లాకుల్లోని 7841 గ్రామాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ.. బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 3500 చొప్పున అందజేసేందుకు ఆమోదం తెలిపింది. ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్లో దిగువ సర్వీసులో వివిధ విభాగాలకు చెందిన 905 అదనపు నాన్ గెజిటెడ్ పోస్టులకు ఆమోదం తెలిపారు. అంతేకాదు వివిధ యూనివర్సిటీల్లో టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ సహా పలు పోస్టుల భర్తీకి మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
Also Read: అతిభయంకరమైన రెడ్ కింగ్ కోబ్రాను ఎప్పుడైనా చూసారా.. లేదంటే ఈ వీడియో చూడండి!
Also Read: ఎంఎస్ ధోనీకి ఇష్టమైన సబ్జెక్టు ఏంటో తెలుసా.. మీరు అస్సలు ఊహించలేరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook