Godfather Movie First Week Collections: Distributors in Tension: మెగాస్టార్ చిరంజీవి హీరోగా సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. రీమేక్ చిత్రాల స్పెషలిస్ట్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో నయనతార, సునీల్, సత్యదేవ్, సముద్రఖని, దివి, గెటప్ శ్రీను, షఫీ వంటి వారు కీలక పాత్రలలో కనిపించారు. నిజానికి మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాకు తెలుగు రీమేక్ గా రూపొందించిన ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. అయితే టాక్ విషయంలో అంతా పాజిటివ్ గానే ఉన్నా కలెక్షన్ల విషయంలో మాత్రం ఊహించిన మేర అంచనాలను అందుకోలేకపోయిందనే ప్రచారం ఉంది.
నిజానికి ఈ సినిమా ఏకంగా మొదటి రోజే 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టిందంటూ సినిమా యూనిట్ ప్రకటించింది అంతేగాక సినిమా ఐదు రోజుల్లోనే 100 కోట్లు కలెక్షన్లు దాటేసింది అంటూ మరో ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే ప్రచారం ఇలా ఉండగా రియాలిటీ మాత్రం చాలా దారుణంగా ఉందనే వాదన వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మొదటి రోజు 12 కోట్ల 97 లక్షలు, రెండో రోజు ఏడు కోట్ల 73 లక్షలు, మూడవరోజు ఐదు కోట్ల 41 లక్షలు, నాలుగో రోజు 5 కోట్ల 62 లక్షలు, ఐదో రోజు 5 కోట్ల 23 లక్షలు వసూలు చేసిన ఈ సినిమా ఆరవ రోజు కేవలం కోటిన్నర రూపాయలు మాత్రమే వసూలు చేసింది.
ఇక ఏడవ రోజు మరీ దారణంగా 83 లక్షల మాత్రమే వసూలు చేయడంతో మొత్తంగా ఇప్పటివరకు ఏడు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాలలో 39 కోట్ల 30 కోట్ల షేర్ వసూళ్లు 64 కోట్ల 80 లక్షలు గ్రాస్ వసూళ్లు వసూలు చేసింది. ఇక ఏడవ రోజు గాడ్ ఫాదర్ వసూళ్లు మరీ దారుణంగా ఉన్నాయి. నైజాం ప్రాంతంలో 26 లక్షలు, సీడెడ్ ప్రాంతంలో 20 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 13 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఏడు లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో ఆరు లక్షలు, గుంటూరు జిల్లాలో నాలుగు లక్షలు, కృష్ణాజిల్లాలో 4 లక్షలు, నెల్లూరు జిల్లాలో మూడు లక్షలు, వెరసి మొత్తం ఆంధ్ర తెలంగాణ కలిపి 83 లక్షల రూపాయల షేర్ వసూళ్లు సాధించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏడు రోజులకు ఎంత కలెక్ట్ చేసిందని వివరాల్లోకి వెళితే
వారం రోజులకు కలిపి
నైజాం : 11.63 కోట్లు
సీడెడ్ : 8.91 కోట్లు
ఉత్తరాంధ్ర: 5.29 కోట్లు
ఈస్ట్ గోదావరి: 3.42 కోట్లు
వెస్ట్ గోదావరి: 2.04 కోట్లు
గుంటూరు: 3.70 కోట్లు
కృష్ణ: 2.44 కోట్లు
నెల్లూరు: 1.87 కోట్లు
ఏపీ- తెలంగాణలో కలిపి :- 39.30 కోట్లు షేర్ (64.80 కోట్లు గ్రాస్)
కర్ణాటక- 4.50 కోట్లు
హిందీ సహా ఇండియా మొత్తం తెలుగు వర్షన్ – 4.55 కోట్లు
ఓవర్ సీస్ – 4.75 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా – 53.10 కోట్ల షేర్ (96.35 కోట్ల గ్రాస్)
మేరకు ఉన్నాయి. ఈ సినిమా మొత్తం బిజినెస్ 91 కోట్ల రూపాయలకు జరగడంతో 92 కోట్ల రూపాయలు వసూలు చేస్తే సూపర్ హిట్ గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేశారు. ఇప్పుడు వచ్చిన కలెక్షన్లను బట్టి పరిశీలిస్తే ఇంకా 38 కోట్ల తొంబై లక్షలు వస్తే కానీ ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్ దక్కించుకోవడం కష్టమని చెప్పాలి. అయితే వాస్తవానికి సినిమా యూనిట్ చేస్తున్న ప్రచారానికి చాలా తేడా ఉంది. ఇంకా 38 కోట్ల తొంబై లక్షలు గనుక వసూలు చేయకపోతే డిస్ట్రిబ్యూటర్లు మరోసారి నష్టపోవడం ఖాయం అని అంటున్నారు.
ఈసారి తెలివిగా డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడకుండా అడ్వాన్స్ బేసిస్ తో సినిమాను రిలీజ్ చేయడంతో కొంతవరకు డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ గానే ఉన్నట్లుగా చెప్పాలి. ఏదేమైనా నిర్మాతలకు థియేట్రికల్ రిలీజ్ విషయంలో మాత్రం ఇది కొంతవరకు ఇబ్బందికరమైన విషయమే. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కుల సుమారు 57 కోట్లకు నెట్ ఫ్లిక్స్ సంస్థకు అమ్మేయడంతో కాస్త అక్కడ నుంచి సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా ఇప్పటివరకు తెలుగు హిందీ భాషల్లో విడుదలవగా ఇప్పుడు తమిళ భాషలో కూడా అక్టోబర్ 14వ తేదీన విడుదలవుతోంది.
నోట్: ఇక జీ తెలుగు అందిస్తున్న ఈ సమాచారం వివిధ మాధ్యమాల నుంచి సేకరించింది. ఈ సమాచారాన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.
Also Read: Ram Gopal Varma - Garikapati : గరికపాటిని వదలని వర్మ.. నెమళ్ల సంతాన ప్రక్రియ వీడియోతో పరువుతీస్తోన్న ఆర్జీవీ
Also Read: Garikipati Narasimha Rao Clarity: చిరంజీవికి గరికిపాటి క్షమాపణలు చెప్పలేదా.. ఆ పోస్టుకు అర్థమేంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook