ప్రధాని నరేంద్ర మోదీ ఆకాశవాణి ద్వారా ప్రజలనుద్దేశించి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన ఈ నాలుగేళ్లలో మన్ కీ బాత్ ద్వారా ప్రసంగించడం ఇది 44వ సారి. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో తన ఆలోచనలను పంచుకోవడమే కాకుండా.. ప్రజల నుంచి సూచనలూ, సలహాలూ కూడా స్వీకరిస్తారు. మన్ కీ బాత్ కార్యక్రమానికి ముందు ప్రధాని నరేంద్రమోదీ ఈ ఉదయం ఢిల్లీ- మీరట్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారు. అలాగే నిజాముద్దీన్ బ్రిడ్జిని ప్రారంభించారు. నిజాముద్దీన్ నుంచి ఢిల్లీ వరకూ నాలుగు లేన్ల రోడ్ సర్వీస్ దీని ద్వారా ప్రజలకు అందుబాటులోనికి వచ్చింది. నిజాముద్దీన్ బ్రిడ్జిపై ఆయన ఓపెన్ జీప్‌లో ఆరు కిలోమీటర్లు రోడ్ షో నిర్వహించారు.
PM Narendra Modi holds road show after inauguration of first phase of Delhi-Meerut Expressway pic.twitter.com/6C01TU2NBL
— ANI (@ANI) May 27, 2018
WATCH: PM Narendra Modi holds road show after inauguration of first phase of Delhi-Meerut Expressway. Union Ministers Nitin Gadkari and Mansukh Mandaviya also present pic.twitter.com/K1OB5krvua
— ANI (@ANI) May 27, 2018
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియోలో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలతో తన ఆలోచనలను పంచుకున్నారు. ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్ కాలుష్యం పట్ల మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మనిషి మనుగడను ప్రభావితం చేసే పర్యావరణ పరిరక్షణను అందరూ బాధ్యతగా చేపట్టాలని పిలుపునిచ్చారు. మనం నిర్లక్ష్యంగా, అత్యాశతో చేస్తున్న పనుల వల్లే గ్లోబల్ వార్మింగ్, అకాల వర్షాలు, భూకంపాలు వంటివి వస్తున్నాయని చెప్పారు. "ఈ ఏడాది ప్లాస్టిక్ అంతం" అనే థీమ్‌తో జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని భారత్ నిర్వహిస్తుందని వెల్లడించారు.
I would like to congratulate the six daughters of India (6-member all women team of Navy) who sailed 22,000 nautical miles in 254 days to circumnavigate the globe: PM Narendra Modi #INSVTarini #MannKiBaat pic.twitter.com/fIadkK2qBt
— ANI (@ANI) May 27, 2018
D Prakash Rao, from Odisha's Cuttack has been selling tea for the past 50 years. He spends 50% of his income on the education of more than 70 poor children. His life is an inspiration to all: PM Narendra Modi #MannKiBaat pic.twitter.com/QIbU4tuQs0
— ANI (@ANI) May 27, 2018
I laud 5 tribal students from Chandrapur, Maharashtra, Ajeet and Deeya Bajaj, Sangeeta Bahl and a BSF contingent for scaling the Mount Everest. The BSF contingent also brought back dirt that had accumulated in the mountains: PM Narendra Modi #MannKiBaat pic.twitter.com/zILm3yTuBB
— ANI (@ANI) May 27, 2018
ఆరోగ్యం విషయంలో ఫిట్నెస్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ ఛాలెంజ్‌ను సంతోషంగా స్వీకరిస్తున్నానని అన్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఫిట్నెస్ తప్పనిసరి అని అన్నారు. 254 రోజులలో 22వేల కిలోమీటర్లు సముద్ర మార్గంలో ప్రయాణించిన మహిళా నావికా బృందాన్ని ప్రధాని మోదీ అభినందించారు. సముద్ర మార్గంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన ఈ ఆరుగురు యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు.