Sprouts Side Effects: మొలకలెత్తిన విత్తనాలను ఇలా తీసుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..!

Sprouts Side Effects:  మొలకలెత్తిన విత్తనాలను అతిగా తినడం వల్ల గ్యాస్, ఆమ్లత్వం వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జీర్ణ క్రియ సమస్యలతో బాధపడేవారు అస్సలు వీటిని తీసుకోవద్దు. ఒక వేళా తీసుకున్న నూనెలో వేయించి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 11, 2022, 01:11 PM IST
  • మొలకలెత్తిన విత్తనాలను రోజూ తింటే..
  • జీర్ణం క్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
  • గ్యాస్, ఆమ్లత్వం వంటి సమస్యలు వస్తాయి.
Sprouts Side Effects: మొలకలెత్తిన విత్తనాలను ఇలా తీసుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..!

Sprouts Side Effects:  శరీరం ఆరోగ్యంగా ఉండడానికి శరీరానికి మొలకలు చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు శరీర అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, ఫైబర్, కాల్షియం, విటమిన్ ఎ, సి మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి అధికంగా తీసుకుంటారు. అయితే చాలా మంది వీటిని అతిగా తీసుకుంటున్నారు. ఇలా అతిగా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీటిని క్రమం తప్పకుండా అతిగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, పైల్స్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు అస్సలు తినొద్దు.

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తినకూడదు:

మొలకలెత్తిన విత్తనాలను తీసుకోవడం వల్ల శరీరంలో చాలా రకాల మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వీటిని అతిగా తీసుకోవడం వల్ల జీర్ణం సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా  గ్యాస్, ఆమ్లత్వం వంటి సమస్యలు వస్తాయి. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు మొలకలెత్తిన విత్తనాలను తీసుకోవడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. వీటిని క్రమంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థలో తీవ్ర సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి.
 
ఇలా వినియోగించుకోవచ్చు:
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు లేదా జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు మొలకలను పచ్చిగా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే క్రమంగా తినాలనుకునేవారు వీటిని మొదట కొద్దిగా నూనె, అల్లం పొడి మొదలైనవి వేసి ఉడికించి తీసుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

మొలకలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
మొలకలలో అనేక రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిని క్రమంగా తీసుకుంటే శరీరం అన్ని పోషకాలు అందుతాయి. అంతేకాకుండా పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణ క్రియ సమస్యలున్నవారు.. తప్పకుండా వీటిని నూనెలో వేయించి తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Share Market: ఈ రంగాల్లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించే అవకాశం, మార్కెట్ నిపుణుల సూచన ఇదే

Also Read: Share Market: ఈ రంగాల్లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించే అవకాశం, మార్కెట్ నిపుణుల సూచన ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Trending News