IND vs SA: రెండో వన్డేలో ఫన్నీ ఘటన.. టాస్‌ కాయిన్‌ మర్చిపోయిన జవగల్ శ్రీనాథ్‌!

Javagal Srinath forgetting to give the toss coin to Shikhar Dhawan. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రాంచి వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 9, 2022, 07:10 PM IST
  • రెండో వన్డేలో ఫన్నీ ఘటన
  • టాస్‌ కాయిన్‌ మర్చిపోయిన జవగల్ శ్రీనాథ్‌
  • గబ్బర్ టాస్‌ వేయగా.. మహారాజ్‌ గెలిచాడు
IND vs SA: రెండో వన్డేలో ఫన్నీ ఘటన.. టాస్‌ కాయిన్‌ మర్చిపోయిన జవగల్ శ్రీనాథ్‌!

Javagal Srinath forgets to give toss coin to Shikhar Dhawan: రాంచి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. టాస్‌ సమయంలో మ్యాచ్‌ రిఫరీ, టీమిండియా మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్‌.. కెప్టెన్‌లు శిఖర్ ధావన్, కేశవ్ మహారాజ్‌కు టాస్‌ కాయిన్‌ ఇవ్వడం మర్చిపోయారు. దాంతో కెప్టెన్‌లతో సహా మ్యాచ్ ప్రెజెంటర్, టీమిండియా మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ నవ్వులు పూయించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

భారత్, దక్షిణాఫ్రికా జట్ల కెప్టెన్‌లు శిఖర్ ధావన్, కేశవ్ మహారాజ్‌ ఆదివారం టాస్ వేయడానికి రాంచి మైదానంలోకి వచ్చారు. వీరితో పాటు మ్యాచ్ ప్రెజెంటర్ సంజయ్ మంజ్రేకర్, మ్యాచ్‌ రిఫరీ జవగల్ శ్రీనాథ్‌ మైదానం మధ్యలోకి వచ్చారు. టాస్ కాయిన్‌ ఎవరి వద్ద ఉందని మంజ్రేకర్ ఇరు జట్ల కెప్టెన్‌ను అడిగాడు. దాంతో ధావన్‌, మహారాజ్ ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. కాయిన్‌ వారిద్దరి దగ్గర లేదు. మ్యాచ్‌ రిఫరీ శ్రీనాథ్‌ కాయిన్‌ కెప్టెన్లకు ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు.

ఇంతలో దక్షిణాఫ్రికా సారథి కేశవ్ మహారాజ్‌ ఉట్టి చేతులతోనే టాస్‌ కాయిన్‌ విసిరినట్టు చేశాడు. దాంతో అందరూ నవ్వులు పూయించారు. ఆపై మ్యాచ్‌ రిఫరీ శ్రీనాథ్‌ కాయిన్‌ను భారత కెప్టెన్ శిఖర్ ధావన్‌కు అందించాడు. గబ్బర్ టాస్‌ వేయగా.. మహారాజ్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: IND vs SA: రెండో వన్డేలో రాణించిన హెండ్రిక్స్‌, మార్‌క్రమ్.. భారత్‌ లక్ష్యం ఎంతంటే?

Also Read: King Kobra Venom: కింగ్ కోబ్రా కోరల్లోంచి విషం తీసిన వ్యక్తి.. బాబోయ్ ఇంత ఉంటుందా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News