దేశంలో చలికాలం ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. నవంబర్, డిసెంబర్ నాటికి చలి ప్రతాపం చూపిస్తుంది. అదే సమయంలో నీళ్లు ముట్టుకోవాలంటేనే భయమేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఏం చేయాలనేది ఓ సవాలుగా మారుతుంటుంది.
చలికాలంలో నీళ్లు దాదాపు గడ్డ కట్టే పరిస్థితి వస్తుంది. ఒకవేళ గడ్డకట్టకపోయినా ముట్టుకోలేనంత చల్లగా ఉంటాయి. ఇంట్లో నీళ్లతో ఏ పని చేయాలన్నా ఇబ్బందే. ఈ పరిస్థితుల్లో వేడి నీళ్ల ఉపయోగం చాలా ఉంటుంది. మరి సెకన్ల వ్యవధిలో నీళ్లు ఎలా వేడి చేయాలనేది ఓ సమస్యగా మారుతుంటుంది. సెకన్ల వ్యవధిలో ట్యాప్ అలా విప్పగానే వేడి నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటే బాగుంటుంది. అలాంటి ఉత్పత్తి మార్కెట్లో వచ్చేసింది కూడా. ఇప్పుడా ప్రొడక్ట్ మార్కెట్లో ట్రెండ్ అవుతోంది. ధర కూడా చాలా తక్కువ.
ట్యాప్ వాటర్ హీటర్ మంచి ప్రత్యామ్నాయంగా కన్పిస్తోది. మార్కెట్లో సులభంగానే లభిస్తోంది. మీ ఇంట్లో చాలా సులభంగా అమర్చుకోవచ్చు. గీజర్ కోసం 10 వేల నుంచి 15 వేల రూపాయలు ఖర్చు చేసేబదులు..ఈ డివైస్ తీసుకుంటే మంచిది. ఈ డివైస్ ధర చాలా తక్కువ. సెకన్ల వ్యవధిలోనే నీటిని వేడి చేస్తుంది. ట్యాప్‌కు అమర్చుకునే పరికరం ఇది. ట్యాప్ ఇలా విప్పగానే సెకన్ల వ్యవధిలో నీళ్లు వేడెక్కి బయటకు వచ్చేస్తాయి. ఈ డివైస్ బాడీను షాక్ ప్రూఫ్‌గా తయారు చేశారు. ఇందులో డిస్ప్లే కూడా ఉంటుంది.
అమెజాన్‌లో కూడా ఈ డివైస్ లభ్యమౌతోంది. దీని ధర దాదాపుగా 1200 రూపాయలుంది. ప్లాస్టిక్ మెటీరియల్‌తో చేసిన బాడి కావడంతో షాక్ తగలదు. ఈ డివైస్ అమర్చుకోవడం కూడా చాలా సులభం. చాలా వేగంగా నీళ్లు వేడెక్కుతాయి.
Also read: Credit Card Payment: క్రెడిట్ కార్డు ఈఎంఐ చెల్లింపులో తప్పకుండా గుర్తుంచుకోవల్సిన విషయాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook