Akhanda Vs God Father: రెండో రోజు ఊపందుకున్న గాడ్ ఫాదర్.. ఎట్టకేలకు అఖండను బీట్ చేసేసిందిగా!

Akhanda Vs God Father Day 2 Collections: మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా అఖండ కలెక్షన్స్ ను బీట్ చేయలేకపోయిందని సోషల్ మీడియాలో చర్చజరగగా రెండో రోజు వసూళ్లలో మాత్రం గాడ్ ఫాదర్ అఖండను బీట్ చేసేసింది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 7, 2022, 03:02 PM IST
Akhanda Vs God Father: రెండో రోజు ఊపందుకున్న గాడ్ ఫాదర్.. ఎట్టకేలకు అఖండను బీట్ చేసేసిందిగా!

Akhanda Vs God Father Day 2 Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్ అనే సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా 5వ తేదీన ఈ సినిమా ఘనంగా విడుదలైంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక కీలకపాత్రలో నటించడంతో సినిమాని హిందీలో కూడా పెద్ద ఎత్తున విడుదల చేశారు. అయితే ఈ సినిమా మొదటి రోజు టాక్ బాగానే వచ్చినా వసూళ్లు విషయంలో మాత్రం కాస్త వెనకబడింది. సాధారణంగానే నందమూరి బాలకృష్ణకు మెగాస్టార్ చిరంజీవికి గట్టి పోటీ ఉంటుంది.

ఈ విషయాన్ని ఆ హీరోలు ఫీల్ అవ్వకపోయినా వారి అభిమానులు మాత్రం ఫీలవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా కలెక్షన్లతో గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్లను పోలుస్తూ నందమూరి అభిమానులు మెగా అభిమానులు ఇద్దరు సోషల్ మీడియాలో కామెంట్లు చేసుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తక్కువ రేట్లతో కూడా మంచి కలెక్షన్లు సాధిస్తే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా రేట్లు పెంచిన తర్వాత కూడా అఖండ సినిమా కలెక్షన్లను దాటి లేకపోయిందని మెగాస్టార్ పని అయిపోయిందని నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

మెగా అభిమానులు కూడా మేమేమి తక్కువ తినలేదని ఏకంగా థియేటర్ల లెక్కతో సహా బయటపెట్టి రెండు వందల ధియేటర్లు తక్కువ రిలీజ్ అయినా సరే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ఎక్కడ వెనక్కి తగ్గకుండా వసూళ్ల వర్షం కురిపించారని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రెండవ రోజు వసూళ్ల విషయంలో గాడ్ ఫాదర్ సినిమా కాస్త హుషారు చూపించింది. మొదటి రోజు కలెక్షన్ల కంటే పెరుగుతుందని ఆశించారు కానీ పెరగలేదు. అయితే అఖండ సినిమా రెండోరోజు వసూళ్ల కంటే గాడ్ ఫాదర్ సినిమా రెండో రోజు వసూళ్లు ఎక్కువగా వచ్చాయి.

గాడ్ ఫాదర్ సినిమాని మోహన్ రాజా డైరెక్ట్ చేయగా ఎన్వి ప్రసాద్, ఆర్బి చౌదరి సంయుక్తంగా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ మీద నిర్మించారు. ఈ సినిమాలో నయనతార, సల్మాన్ ఖాన్, సునీల్, దివి, అనసూయ వంటి వారు కీలక పాత్రలలో నటించారు. ఇక నందమూరి బాలకృష్ణ అఖండ విషయానికి వస్తే మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమాను బోయపాటి శ్రీను డైరెక్ట్ చేశారు . గ్యాస్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించారు. ఇక ఈ రెండు సినిమాలు రెండు రోజులు వసూళ్ల తేడా ఎలా ఉందనేది కింద టేబుల్ లో చూద్దాం.
 

అఖండ- 2వ రోజు  గాడ్ ఫాదర్- 2వ రోజు 
నైజాం : 2.26 కోట్లు నైజాం: 2.38 కోట్లు
సీడెడ్ : 1.98 కోట్లు సీడెడ్: 1.96 కోట్లు
ఉత్తరాంధ్ర : 69 కోట్లు ఉత్తరాంధ్ర: 1.01 కోట్లు
ఈస్ట్ గోదావరి: 46 కోట్లు  ఈస్ట్ గోదావరి: 51 లక్షలు
వెస్ట్ గోదావరి: 34 లక్షలు వెస్ట్ గోదావరి: 45 లక్షలు
గుంటూరు : 41 కోట్లు  గుంటూరు: 60  లక్షలు
కృష్ణ : 44 లక్షలు కృష్ణా: 49 లక్షలు
నెల్లూరు : 25 లక్షలు నెల్లూరు: 33  లక్షలు
ఆంధ్ర ప్రదేశ్ -తెలంగాణ : 6.83 కోట్లు షేర్ (23 కోట్లు గ్రాస్)  ఆంధ్ర ప్రదేశ్ -తెలంగాణ : 7.73 కోట్లు (13.35 కోట్ల గ్రాస్)
కర్ణాటక + ఇండియా (2 రోజులు) : 1 .85 కోట్లు కర్ణాటక +ఇండియా(2 రోజులు) : 2.30 కోట్లు+ హిందీ:1.80 కోట్లు
ఓవర్సేస్ : 3.15 కోట్లు  ఓవర్సేస్:  2.55  కోట్లు

అఖండ ప్రపంచవ్యాప్తంగా:          

27.22 కోట్లు ( 43.5 కోట్లు గ్రాస్)  

 గాడ్ ఫాదర్ ప్రపంచ వ్యాప్తంగా : (2 రోజులు) కలిపి

 27.35 కోట్లు  (50.35 కోట్లు గ్రాస్)

Also Read: Garikapati with Chiranjeevi: మెగా ఫాన్స్ ఆగ్రహం.. చిరంజీవితో మాట్లాడతా, అందరికీ చెప్పండి..లైవ్లోనే గరికపాటి క్లారిటీ!

Also Read: Dhanush - Aishwarya : మళ్లీ ఒక్కటవ్వబోతోన్న ఐశ్వర్య - ధనుష్.. ఇంతలో ఏం జరిగిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News