Mega Fans Questioning Anti fans On Cricketers Meeting Ram Charan: హైదరాబాద్ లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా టి20 సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ వంటి వారు రామ్ చరణ్ నివాసానికి వెళ్లినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ఆహ్వానం మేరకే వారు రాంచరణ్ నివాసానికి వెళ్లారని ఒక ప్రచారం జరుగుతుండగా, లేదు టీమ్ ఇండియా ప్లేయర్లు రామ్ చరణ్ ను కలుస్తామని సందేశం పంపడంతోనే దానికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మరో ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికీ దీనికి సంబంధించి అధికారిక ఫోటోలు కానీ క్లారిటీ కానీ ఏదీ లేదు. అసలు నిజంగా రాంచరణ్ ఆహ్వానించారా లేక క్రికెటర్లు అక్కడికి వెళ్లారా అనే విషయం మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు కానీ రామ్ చరణ్ అభిమానులు మాత్రం సరికొత్త వాదన తెరమీదకు తీసుకొస్తున్నారు. అదేమిటంటే గతంలో ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజు వంటి డైరెక్టర్లు రామ్ చరణ్ నివాసానికి వచ్చిన సమయంలో మెగా ఫ్యామిలీ అంటే గిట్టని వారు కొంతమంది కావాలనే ప్రచారం జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ వారిని బలవంతంగా భోజనానికి పిలిపించుకున్నారని తమకు మంచి సబ్జెక్టులు చెప్పి తమతో సినిమాలు చేయమని కాస్త ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారని ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు సినిమా పరిశ్రమతో ఏమాత్రం సంబంధం లేని క్రికెటర్లు ఎందుకు రాంచరణ్ నివాసానికి రావాలి? సరే రామ్ చరణ్ స్వయంగా పిలిచారు అనుకుందాం, పిలిస్తే మాత్రం క్రికెటర్లు క్రికెట్ ఆడి అలిసిపోయి ఉంటాం కదా ఇప్పుడు ఎందుకు వెళతాంలే అనుకునే లైట్ తీసుకోవచ్చు కదా.
కానీ వాళ్ళు వచ్చి ఇలా కలుస్తున్నారంటే రామ్ చరణ్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవాలంటూ కొందరు మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో కచ్చితంగా ప్లస్ పాయింట్ అని ఎన్టీఆర్ తో పోలికే లేదని వారు అంటున్నారు. ఒకవేళ ఇదే ఇండియన్ క్రికెట్ టీం జూనియర్ ఎన్టీఆర్‌ను కనుక గెలిస్తే ఆ ప్రచారం వేరేగా ఉండేదని, ఒక రేంజ్ లో ఆయన అభిమానులు రచ్చ చేసేవారని అంటున్నారు.
కానీ ప్రచారం అంటే అసలు పడని మెగా ఫ్యామిలీ ఇప్పటివరకు ఈ విషయాన్ని సైలెంట్ గా ఉంచిందని కామెంట్ చేస్తున్నారు. రామ్ చరణ్, చిరంజీవి మీద దేశవ్యాప్తంగా మంచి గౌరవం ఉంది కాబట్టే ఇలా సెలబ్రిటీలు వారిని కలిసి ఎందుకు ఆసక్తి చూపిస్తారని అంటున్నారు. సౌత్ టాప్ డైరెక్టర్లు కలిస్తే సినిమాలు చేయించేందుకే వారిని కాకా పట్టేందుకు ఇంటికి పిలిపించుకున్నారు అనే ప్రచారం జరిగింది, మరి ఇప్పుడు క్రికెటర్లు ఇంటికి వచ్చారు, ఈ విషయంలో ఏమని ప్రచారం చేస్తారు అంటూ మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
Also Read : The Ghost in Hindi: చిరుతో పోటీకి నాగ్.. హిందీలో కూడా వెనక్కు తగ్గకుండా!
Also Read : Aadi Movie Re Release: నవంబర్‌లో 'ఆది' రీ రిలీజ్.. ఎన్టీఆర్ ఫాన్స్ కు విషమ పరీక్షే.. ఎందుకంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook