Today Gold Rates: మనదేశంలోని స్త్రీలు ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. అందుకే ధర తగ్గాలని వారు కోరుకుంటారు. గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. 22 క్యారెట్లపై రూ.200, 24 క్యారెట్లపై రూ.240 మేర ఇవాళ (Gold Price Today 23 September) రేటు పెరిగింది. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.46,000 ఉండగా.. 24 క్యారెట్లు రూ.50,200 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు దేశీయ మార్కోట్లో ఉదయం 6 గంటలకు నమోదైనవి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసడి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
>>దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,150గా.. 24 క్యారెట్లు రూ.50,350గా ఉంది.
>>ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000, 24 క్యారెట్లు రూ.50,200గా ఉంది.
>>చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల రూ.51,000 వద్ద కొనసాగుతోంది.
>>కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల రూ.50,200గా ఉంది.
>>బెంగళూరులో 22 క్యారెట్లు రూ.46,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,240కు లభిస్తుంది.
>>కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్లు రూ.50,200 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో...
>>హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,200గా కొనసాగుతోంది.
>>విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200లుగా ఉంది.
>>విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200 గా కొనసాగుతోంది.
Also Read: Post Office Schemes: నూటికి నూరు శాతం సురక్షితం, నెలకు 15 వందలతో 35 లక్షల సంపాదన, ఎలా సాధ్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook