RRR US Distributors To Launch Full Academy Awards Campaign For the Movie: దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయమని తెలుగులో ఒక సామెత ఉంటుంది అదేవిధంగా ఆస్కార్ కి నామినేషనే జరగలేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ కి ఆస్కార్, రామ్ చరణ్ కు ఆస్కార్ అంటూ గత కొన్ని రోజులుగా తెలుగు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి. తాజాగా భారత్ తరపున అఫీషియల్ ఆస్కార్ ఎంట్రీగా గుజరాతి సినిమా చెల్లో షోను నామినేట్ చేయడంతో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ఆశలన్నీ ఒమ్మయినట్లే కనిపిస్తున్నాయి.
అయితే పూర్తిగా ఆశలన్నీ వదులుకోవలసిన అవసరం లేదని ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కు నామినేట్ అయ్యేందుకు మరిన్ని అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఆస్కార్ నామినేషన్స్ లో ఎందుకు ఆర్ఆర్ఆర్ ను చేర్చలేదు అంటూ పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ అభిమానులే కాక నార్త్ అభిమానులు సైతం ప్రభుత్వాన్ని, కమిటీని పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలిచేందుకు మరో అవకాశం ఉంది.
అదేమిటంటే ఆస్కార్ అకాడమీ అవార్డుల రూల్స్ ప్రకారం ఏ సినిమా అయినా లాస్ ఏంజెల్స్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వారం పాటు ప్రదర్శించబడితే ఆ సినిమా ఆస్కార్ కి నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ లెక్కన అయితే ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ జాబితాలో జనరల్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉంది. అంతేకాక దీనిని నామినేట్ చేయడానికి నవంబర్ 15వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఇక ఆర్ఆర్ఆర్ అభిమానులకు శుభవార్త చెబుతూ ఈ సినిమాని అమెరికాలో డిస్ట్రిబ్యూట్ చేసిన వేరియెంట్ ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాని అన్ని విభాగాల్లోనూ నామినేట్ చేయాలని ఆస్కార్ అకాడమీ లో ఉన్న పదివేల మంది సభ్యులకు పిలుపునిచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్, బెస్ట్ సౌండ్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాలలో ఆర్ఆర్ఆర్ ను నామినేషన్ కోసం సబ్మిట్ చేయనున్నట్లు అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ వెరైటీ ఫిలిమ్స్ సంస్థ మీడియాకు వెల్లడించినట్లు తెలుస్తోంది. రాజమౌళి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు.
ఎన్టీఆర్, కొమరం భీమ్ పాత్రలో కనిపించగా రాంచరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. ఇక వీరి సరసన అలియా భట్, ఒలీవియా మోరిస్ నటించారు. ఈ సినిమాను సుమారు 450 కోట్ల రూపాయలతో డీవీవీ దానయ్య నిర్మించగా కీరవాణి సంగీతం అందించారు. ఎప్పటిలాగే రాజమౌళి కుటుంబం అంతా ఈ సినిమా కోసం కష్టపడింది. సుమారు 1130 కోట్ల రూపాయల దాకా ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు వచ్చాయి.
ఇక ఈ సినిమాను ఎక్కువ మంది ఓట్ చేసే విధంగా అమెరికా థియేటర్లలో ప్రదర్శించాలని డిస్ట్రిబ్యూటర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి హాలీవుడ్ డైరెక్టర్లు, రచయితలు, పలువురు నటీనటులు కూడా ఈ సినిమా అద్భుతంగా ఉందని సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన కొత్తలో చాలా ట్వీట్లు చేశారు. ఇప్పుడు వారందరూ కూడా సినిమాకి మద్దతుగా నిలబడితే సినిమా నామినేట్ అవ్వడం పెద్ద విషయమేమీ కాదనే వాదన వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.
Also Read: Liger OTT: ఓటీటీలోకి లైగర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎందులోనో తెలుసా?
Also Read: OSCAR Awards: ఆస్కార్‌కు ఇండియా నుంచి లాస్ట్ ఫిల్మ్ షో, ఆర్ఆర్ఆర్ ఎందుకు నామినేట్ కాలేదో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.