Amit Shah: మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడో చెప్పిన అమిత్ షా.. సమన్వయం లేదని పార్టీ నేతలకు క్లాస్..

Amit Shah: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందన్న దానిపై క్లారిటీ లేదు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు నిర్వహిస్తారా లేక గుజరాత్ అసెంబ్లీ పోల్స్ తో పాటు జరుగుతుందా అన్న దానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.

Written by - Srisailam | Last Updated : Sep 17, 2022, 03:17 PM IST
  • తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ
  • మునుగోడు ఉప ఎన్నికపై చర్చ
  • సమన్వయం లేదని క్లాస్ పీకిన షా
Amit Shah: మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడో చెప్పిన అమిత్ షా.. సమన్వయం లేదని పార్టీ నేతలకు క్లాస్..

Amit Shah: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందన్న దానిపై క్లారిటీ లేదు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు నిర్వహిస్తారా లేక గుజరాత్ అసెంబ్లీ పోల్స్ తో పాటు జరుగుతుందా అన్న దానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే మునుగోడు ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదనే ప్రచారం కూడా సాగుతోంది. మునుగోడులో సర్వే చేయించిన బీజేపీ హైకమాండ్.. పార్టీ పరిస్థితి ఆశించినంతగా లేకపోవడంతో ఉప ఎన్నికను మరింత ఆలస్యం చేయవచ్చనే వాదనలు కూడా కొన్ని వర్గాల నుంచి వస్తుండటంతో మునుగోడు బైపోల్ పై గందరగోళం నెలకొంది. అయితే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. మునుగోడు ఉప ఎన్నికపై పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది.

పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ప్రసంగం తర్వాత హరిత ప్లాజా నిర్వహించిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి కేవలం 19 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలతో పాటు మునుగోడు ఉప ఎన్నికపైనే పార్టీ నేతలతో అమిత్ షా చర్చించారు. ఈ సమావేశం హాట్ హాట్ గా సాగిందని తెలుస్తోంది. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందన్న దానిపై అమిత్ షా క్లారిటీ ఇచ్చారని సమాచారం. అక్టోబర్ చివరలో మునుగోడు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని.. పార్టీ నేతలంతా అప్రమత్తంగా ఉండాలని ఆమిత్ షా ఆదేశించారని తెలుస్తోంది. ఉప ఎన్నిక ప్రచార వ్యూహంపైనా నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. మునుగోడులో ప్రచారం పెంచాలని సూచించిన అమిత్ షా.. పార్టీ తరుపున కమిటీని నియమించాలని ఆదేశించారట. మునుగోడులో గెలిచి తీరాలని చెప్పిన అమిత్ షా.. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారట. ప్రతి గ్రామానికి ముగ్గురు నేతలను ఇంచార్జులుగా నియమించాలని సునీల్ బన్సల్ ను ఆదేశించారని సమాచారం.

గంటన్నర పాటు సాగిన సమావేశంలో రాష్ట్ర నేతల తీరుపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. జాతీయ నాయకత్వం అంచనాలను అనుగుణంగా పని చేయలేకపోతున్నారని.. లక్ష్యాలను అందులేకపోతున్నారన్నంటూ బాద్ షా క్లాస్ పీకారని అంటున్నారు. పార్టీ సమన్వయం లోపించిందని.. కొందరు నేతలు సరిగా పని చేయడం లేదని మండిపడ్డారని సమాచారం. కేసీఆర్ పాలనపై గుర్రుగా ఉన్న జనాలు బీజేపీ పట్ల ఆసక్తిగా ఉన్నా.. నేతలు సరిగా పనిచేయడం లేదని అన్నారట. బండి సంజయ్ పాదయాత్రకు మంచి స్పందన వస్తుందని.. మిగితా నేతలకు మరింతగా కష్టపడాలని సూచించారట. కష్టపడితేనే ఫలితం ఉంటుందని.. అలాంటి నేతలకే పార్టీలో మంచి అవకాశాలు వస్తాయని అమిత్ షా తేల్చి చెప్పారట. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ జనాల్లోకి వెళ్లాలని ఆదేశించారని సమాచారం.క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి లంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా కీలక సూచనలు చేశారని అంటున్నారు.

Read Also: Osmania University: ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రిక్తత.. గేట్లు మూసేసిన పోలీసులు  

Read Also: AP Capital: రాజధాని నిర్ణయించే హక్కు రాష్ట్రానిదే! సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ పిటిషన్..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News