Telangana weather updates: రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ పశ్చిమ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తాయని వెల్లడించింది.
Telangana weather updates: ఈ నెల 18న ఉత్తర బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఆవర్తనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి ఏర్పడుతుందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.